నిన్న సాహో చిత్రం మార్నింగ్ పడిన దగ్గరపడిన క్షణం నుంచి సినిమాకు డిజాస్టర్ టాక్ స్ప్రెడ్ అవటం మొదలైంది. రివ్యూలు అన్ని ఏక పక్షంగా సినిమా బాగోలేదని తేల్చేసాయి. అయితే ఇదే సమయంలో మరో విషయం హైలెట్ అవటం మొదలైంది. అదేంటంటే...రాజమౌళి గొప్పతనం.  రాజమౌళి మాత్రమే దేశం మొత్తం మాట్లాడుకుని, సూపర్ హిట్ అయ్యే చిత్రం తీయగలడని తేల్చేసారు. రాజమౌళి అభిమానులు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో సాహోని ట్యాగ్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి, ఆ తర్వాత ప్లాఫ్ అనేది లేకుండా దూసుకుపోతున్నారు.  రాజమౌళి తో సినిమా చేస్తే మాస్ ఇమేజ్ వస్తుందని అందరు హీరో లు నమ్మే స్దితికి వచ్చింది. అది నిజం కూడా.   బాహుబలితో అయితే దేశం మొత్తం మాట్లాడుకునే సినిమా చేయగలిగాడు. సాహో అలాంటి క్రేజ్ రిలీజ్ కు ముందు వరకూ తెచ్చుకున్నా, ఆ తర్వాత తేలిపోయింది. దాంతో చేస్తే రాజమౌళి మాత్రమే అంతటి భారీ బడ్జెట్ చిత్రం చేయగలరని ఫిక్సై పోయారు.   రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాల రికార్డులను బద్దలుకొట్టగల సత్తా మళ్ళి రాజమౌళి మాత్రమే తీయగలరు అంటున్నారు.  

రాజమౌళి, ప్రస్తుతం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బ్రిటిష్ వారిపై పోరాటానికి తెగబడ్డ విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు,  కొమరం భీం ల కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది.