బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ప్రస్తుతం తన ‘డంకీ’ మూవీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక తదుపరి కింగ్ ఖాన్ చేయబోయే సినిమాలపై క్రేజీ అప్డేట్ అందించారు. ఎలాంటి మూవీస్ చేయబోతున్నారో చెప్పుకొచ్చారు.  

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ - స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) కాంబోలో ‘డంకీ’ (Dunki) మూవీ వచ్చిన తెలిసిందే. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కొందరు మాత్రం ఆశించిన మేరకు సినిమా లేదంటూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా Dunki Movie థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్బంగా షారుఖ్ ఖాన్ పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటున్నారు. 

కాగా, ‘డంకీ’ రిలీజ్ తర్వాత షారుఖ్ ఖాన్ ఎలాంటి సినిమా చేయబోతున్నారనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సరిగ్గా దీనిపైనే బాలీవుడ్ స్టార్ క్రేజీ అప్డేట్ అందించారు. తన నెక్ట్స్ మూవీస్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ ఇంటర్వ్యూలో కింగ్ ఖాన్ మాట్లాడుతూ... ‘ఇకపై నా వయస్సుకు తగిన సినిమాలు చేస్తాను. అందులోనూ నేను ప్రధాన పాత్రలో నటిస్తాను. నెక్ట్స్ సినిమా వచ్చే ఏడాది మార్చి లేదంటే ఏప్రిల్ లో ప్రారంభం కానుంది.’ అని చెప్పుకొచ్చారు. ‘డంకీ’ రిలీజ్ అయిన ఒక్కరోజులోనే తన రాబోయే చిత్రంపై క్రేజీ అప్డేట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. షారుఖ్ కామెంట్స్ తో ఎలాంటి సినిమాలు చేయబోతున్నారనేది ఫ్యాన్స్ కు ఇంట్రెస్టింగ్ గా మారింది. 

ఇక షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో దుమ్ములేపారు. తొలుత ‘పఠాన్’, ఆ తర్వాత ‘జవాన్’తో బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ఏకంగా రూ.వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకొని బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ స్టార్ సత్తా చాటారు. ఇక ‘డంకీ’ మూవీ కూడా థియేటర్లలో సందడి చేస్తోంది. తన సినిమాలతో ఇండస్ట్రీలో మార్క్ క్రియేట్ చేసిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం కావడం, షారుఖ్ హీరో కావడంతో డంకీ సినిమా లాంగ్ రన్ లో అలరించనుంది. కానీ ‘సలార్’ దిగడంతో ఈ సినిమాపై ప్రభావం ఉందనీ అంటున్నారు. సలార్ టాక్ అదిరిపోవడంతో ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉంటాయనేది చూడాలి.