ఏజెంట్ అక్కినేని అఖిల్ కి భారీ షాక్ ఇచ్చింది. ఈ చిత్రం అభిమానుల నుండి కూడా విమర్శలు ఎదుర్కొంది. ఈ క్రమంలో అఖిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
స్టార్ కావాలని అఖిల్ చాలా తపన పడుతున్నాడు. అందు కోసం విపరీతంగా కష్టపడుతున్నాడు. ఏజెంట్ మూవీ అతన్ని స్టార్ లీగ్ లో చేర్చుతుందని ఆశపడ్డాడు. స్పై రోల్ కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సాధించాడు. సిక్స్ ప్యాక్ డెవలప్ చేశాడు. ఈసారి గట్టిగా కోరుతున్నామని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. ఫలితం మాత్రం ఉసూరుమనిపించింది. ఏజెంట్ చెత్త మూవీగా ప్రేక్షకులు తీర్మానించారు. అసలు కథ, కథనాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీస్తారా అని మండిపడ్డారు.
నిర్మాత అనిల్ సుంకర నేరుగా ఫెయిల్యూర్ ని ఒప్పుకున్నారు. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా మూవీ చేశాము. దానికి తోడు కొన్ని ప్రతికూల పరిస్థితులు. మొత్తంగా డిజాస్టర్ వచ్చింది. ఏజెంట్ పరాజయానికి బాధ్యత వహిస్తున్నామని ట్వీట్ చేశాడు. విమర్శల దాడి ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ఇది ఉదాహరణ.
అఖిల్ కూడా ట్రోల్స్ కి గురయ్యారు. సినిమా విడుదలకు ముందు చేసిన హడావిడి గుర్తు చేస్తూ యాంటీ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. పూర్తి నిరాశలో ఉన్న అఖిల్ బాధ నుండి బయటపడేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాడట. కొన్నాళ్ళు ఒంటరిగా ఉండాలనుకున్నాడట. అందుకే ఒక్కడే దుబాయ్ ట్రిప్ కి వెళ్ళాడట. ఎయిర్ పోర్ట్ లో ఉన్న అఖిల్ ఫోటోలు బయటకు రాగా, ఆయన టూర్ కన్ఫర్మ్ చేశారు.
కొద్దిరోజుల పాటు దుబాయ్ లో అఖిల్ ఉంటారట. మరోవైపు ఆయన కొత్త ప్రాజెక్ట్స్ కి సైన్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఒకరిద్దరు దర్శకుల పేర్లు వినిపించాయి. అధికారిక సమాచారం మాత్రం లేదు. హీరోగా అఖిల్ మొదటి చిత్రం 'అఖిల్'. తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలు చేశారు. ఇవి మూడు డిజాస్టర్ అయ్యాయి. నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్ అందుకున్నారు.
