నటుడిగా, దర్శకుడిగా రవిబాబు ఏ సినిమా చేసినా.. అది కాస్త రెగ్యులర్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది. అటువంటి ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. వైవిధ్యమైన 
కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రవిబాబు మరోసారి 'అదుగో' అంటూ ఓ పందిపిల్లతో సినిమా తీశాడు.

ఈ సినిమాలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ గురించి చాలా సమయం తీసుకున్నాడు. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఆశించిన కొత్తదనం లేదంటూ తేల్చేస్తున్నారు ప్రేక్షకులు. నిజానికి ఈ ప్రాజెక్ట్ పై రవిబాబు చాలా ఆశలు పెట్టుకున్నాడు.

ఈ మధ్యకాలంలో ఆయన హిట్ సినిమా చేసింది కూడా లేదు. ఈ క్రమంలో 'అదుగో' సినిమా హిట్ అతడికి చాలా అవసరం కానీ ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వస్తోంది. అతి తక్కువ రన్ టైమ్ తో ఈ సినిమాని ఎడిట్ చేసినప్పటికీ సినిమాలో ఆకట్టుకునే అంశాలు లేవని అంటున్నారు.

తెరపై పందిపిల్ల చేసే అల్లరి పదిహేను నిమిషాలు మాత్రమే.. మిగిలిన కామెడీ సన్నివేశాలు, లవ్ ట్రాక్ విసిగిస్తాయని టాక్. దీపావళి బరిలో పందిపిల్ల నిలవడం కష్టమనే అంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

ఇవి కూడా చదవండి.. 

రవిబాబు “అదిగో” టాక్ ఏంటి ఇంత తేడాగా?