Adivi Shesh - Hit 2 :అడివి శేష్ హిట్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్డ్!
యంగ్ హీరో అడివి శేష్ లేటెస్ట్ మూవీ 'హిట్ 2'. నాని నిర్మాతగా ఉన్న ఈ మచ్ అవైటెడ్ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
2020లో విడుదలైన 'హిట్' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని హీరో నాని నిర్మించారు. హిట్ విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అడివి శేష్ హీరోగా హిట్ 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా హిట్ 2 (HIT 2) చిత్ర రిలీజ్ డేట్ చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ మేరకు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. హిట్ 2 జులై 29న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
హిట్ కి దర్శకత్వం వహించి డాక్టర్ శైలేష్ కొలను సీక్వెల్ ని కూడా తెరకెక్కిస్తున్నారు. వాల్ పోస్టర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని నిర్మిస్తున్నారు. హిట్ 2 సైతం అవుట్ అండ్ అవుట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరక్కుతుంది. మీనాక్షి చౌదరి అడివి షేక్ కి జంటగా నటిస్తున్నారు.
కాగా అడివి శేష్ (Adivi Shesh)మరొక చిత్రం విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. మేజర్ (Major) మూవీ ముంబై టెర్రర్ అట్టాక్ లో మరణించిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. మేజర్ మూవీ మహేష్ (Mahesh Babu) సొంత నిర్మాణ సంస్థ జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ లో తెరకెక్కుతుంది. మేజర్ చిత్రం కోసం అడివి శేష్ చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. ఉన్నికృష్ణన్ కుటుంబ సభ్యులను కలవడంతో పాటు, ఆర్మీ శిక్షణ శిబిరాలను సందర్శించారు. మేజర్ మూవీ జూన్ 3న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. కాబట్టి రోజుల వ్యవధిలో అడివి శేష్ నుండి రెండు చిత్రాలు రానున్నాయి. ఇక అడివి శేష్ గత చిత్రాలు గూఢచారి, ఎవరు భారీ విజయం నమోదు చేశాయి.