బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమాల హడావుడి ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిన్న సినిమాలకు కమర్షియల్ గా వచ్చే చిన్న చిన్న లాభాల్ని పెద్ద సినిమాలు ఎంతో కొంత దెబ్బ కొడతాయి. అయితే యువ హీరో అడివి శేష్ మాత్రం పోటీగా ప్రభాస్ భారీ బడ్జెట్ సినిమా సాహో ఉన్నా కూడా పాజిటివ్ కలెక్షన్స్ తో లాభాల్ని అందుకున్నాడు. 

పెద్దగా అంచనాలు లేకుండా గత నెల 16న విడుదలైన ఎవరు సినిమాలు సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాలని పూర్తి చేసుకుంది. రీసెంట్ గా అందించిన సమాచారం ప్రకారం 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా టోటల్ గా 13.1కోట్ల షేర్స్ ని అందుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం గ్రాస్ కలెక్షన్స్ 22కోట్లు. సాహో ఎఫెక్ట్ మొదటి రెండు రోజులు కనిపించినప్పటికీ ఎవరు సినిమా ఓ వర్గం ప్రేక్షకులను గట్టిగానే ఆకర్షించింది. 

సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ నిర్మాతలకు బయ్యర్లకు లాభాలు వచ్చేలా చేసిందని చెప్పవచ్చు. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రెజీనా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ కూడా అదే తరహాలో ఆడియెన్స్ ని మెప్పించాలని యువ హీరో అడివి శేష్ మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం శేష్ మేజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.