క్షణం - గూఢచారి వంటి డిఫరెంట్ హిట్స్ తో ఓ వర్గం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఆ రెండు సినిమాలు మనోడి మార్కెట్ ను కూడా గట్టిగానే పెంచాయని ఇప్పుడు క్లియర్ గా అర్ధమవుతోంది. ఎందుకంటె నెక్స్ట్ ఈ యువ హీరో నుంచి వస్తోన్న 'ఎవరు' సినిమా రిలీజ్ కు ముందే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా కనిపిస్తోంది. 

మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఎవరు వరల్డ్ వైడ్ త్రియేటికల్ వాల్యూ 10కోట్లు. సినిమా బ్లాక్ బస్టర్ అని గుర్తింపు తెచ్చుకోవాలంటే మినిమమ్ 15కోట్లయినా రాబట్టాలి. గతంలో అడివి శేష్ నటించిన గూఢచారి త్రియేటికల్ వాల్యూ 5కోట్లు. అయితే సినిమా 10కోట్ల షేర్స్ ని అందించి డబుల్ ప్రాఫిట్స్ లో నిలబెట్టింది. 

ఇక ఇప్పుడు 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఎవరు ఏ స్థాయిలో లాభాల్ని అందిస్తుందో చూడాలి. పోటీగా మరో మంచి క్రేజ్ ఉన్న సినిమానే విడుదలవుతోంది. శర్వానంద్ గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ రణరంగంపై పాజిటివ్ టాక్ ఉంది. సో ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికర పోటీ నడవనుందని చెప్పవచ్చు.