కర్మ' తో తెలిసి రాలేదు. ఆ తరువాత 'కిస్' ఇచ్చిన దెబ్బకు డైరెక్షన్ ని వదిలి కథల గూడచారిలా మారాడు 'ఎవరు' కథానాయకుడు అడివి శేష్.'క్షణం' నుంచి సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేస్తున్న ఈ హీరో నెక్స్ట్ మేజర్ తో కూడా అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. సినీ కెరీర్ లో జయాపజయాలు కామన్. కానీ డిఫరెంట్ హిట్స్ రెండు మూడు అందుకుంటే అది కెరీర్ కి చాలా కలిసొస్తుంది. 

ఈ జనరేషన్ లో కామెడీ యాంగిల్ లో నాని డిఫరెంట్ టైమింగ్ తో క్లిక్కయితే విజయ్ దేవరకొండ హెవీ యాంగ్రీ అండ్ రియాలిటీ యాక్టింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకొచ్చారు. ఇప్పుడు అదే తరహాలో సొంతంగా అడివి శేష్ కూడా తన కెరీర్ ను సెట్ చేసుకుంటున్న తీరును మెచ్చుకొని తీరాల్సిందే. 

ఈ జనరేషన్ కుర్ర హీరోల కంటే ఒక అడుగు ముందుకు వేసి సొంతంగా తనకు సెట్టయ్యే కథలను రాసుకోని సక్సెస్ లు అందుకుంటున్నాడు. అలాగే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ - ప్రమోషన్స్ వంటి విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. సినిమా ప్రివ్యూలను మీడియాకు ఒక రోజు ముందుగానే వేయడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. 

ఎందుకంటె ఎవరి సినిమాలు వారికి ముద్దుగానే ఉంటాయి. తేడా వస్తే కనీసం అడివి శేష్ చెప్పినట్టుగా పోస్టర్స్ అతికించుకునే పిండి ఖర్చు కూడా వెనక్కి రాదు. అలాంటిది క్రిటిక్స్ ప్రశంసలు అందుకునేలా ఎవడు సినిమాను అడివి శేష్ ప్రమోట్ చేశాడు. సో మనోడు ఇదే విధంగా ఆలోచిస్తే కెరీర్ మరో లెవెల్ కు వెళుతుందని చెప్పవచ్చు. ఆల్ ది బెస్ట్ అడివి శేష్..