కర్మ - కిస్ సినిమాల్లో హీరోగా నటించడమే కాకుండా ఆ సినిమాలకు దర్శకత్వం వహించి నిర్మించిన అడివి శేష్ గట్టి దెబ్బె తిన్నాడు. కెరీర్ ను ఒక ట్రాక్ లో పెట్టుకోవడానికి చాలా కష్టపడ్డాడు. దర్శకుడిగా ప్లాప్ అయినట్లు తనకు తాను ఒప్పుకున్నాడు. ఇక రీసెంట్ 'ఎవరు' సినిమా రిలీజ్ చేసిన శేష్ తన కెరీర్ కు సంబందించిన కొన్ని విషయాలని బయటపెట్టాడు. 

అడివి శేష్ మాట్లాడుతూ.. నేను రచయితగా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం అబ్బూరి రవి. శోబు యార్లగడ్డ కారణంగా పంజా సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ద్వారా నాకు మంచి గుర్తింపు దక్కింది. అయితే దర్శకుడిగా నేను ఫెయిల్ అయ్యాను. డైరెక్ట్ చేసిన కిస్ సినిమా ఫెయిల్ అయ్యింది. అప్పుడు పోస్టర్స్ అతికించడానికి మైదా పిండి ఖర్చు కూడా రాలేదు. 

అందుకే నేను కథ అందించిన క్షణం - గూఢచారి సినిమాల బడ్జెట్ విషయాల్లో ఇన్వాల్స్ అయ్యాను అని అడివి శేష్ వివరణ ఇచ్చాడు. అదే విధంగా నెక్స్ట్ సినిమాల గురించి చెబుతూ.. మహేష్ బాబు నిర్మిస్తున్న మేజర్ సినిమాతో ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు చెప్పిన ఈ యువ హీరో గూఢచారి సీక్వెల్ కి కూడా రెడీ అవుతున్నట్లు చెప్పాడు. ఇక 2 స్టేట్స్ రీమేక్స్ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.