26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలర్పించిన యంగ్‌ ఆర్మీ ఆఫీసర్‌ సందీప్‌ ఉన్ని కృష్షన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్’‌ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గూఢచారి ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే మంచి క్రేజ్ తెచ్చుకుంది. అడవి శేషు గత చిత్రాలు కమర్షియల్  గా మంచి హిట్స్ కావటంతో ప్రి రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో వీకెండ్ సినిమా,,సౌతిరన్ స్టార్ ఇంటర్నేషనల్ కలిసి ఓవర్ సీస్ రైట్స్ సొంతం చేసుకున్నాయి. ఫ్యాన్సీ రేటుకు ఈ రైట్స్ సొంతం చేసుకున్నారు. 
 
అడవి శేషు మాట్లాడుతూ... ‘ఈ సినిమా రిలీజ్ డేట్ లో మార్పు ఉండొచ్చ‌ని కొవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభ‌మైన‌ప్పుడే అనుకున్నాం. ఎందుకంటే చిత్ర టీమ్ లో చాలామంది ముఖ్యంగా విజువ‌ల్ ఎఫెక్స్ట్ (వీఎఫ్ఎక్స్‌) విభాగంలో అంద‌రూ కొవిడ్ బారిన ప‌డ్డారు. మిల‌ట‌రీ ప్ర‌దేశాల్లో షూటింగ్ జ‌రిపేందుకూ ఈ స‌మ‌యంలో అనుమ‌తి ల‌భించ‌లేదు. దాంతో వాయిదా ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని భావించాం. ప్ర‌స్తుతం నెల‌కొన్న కొవిడ్ తీవ్ర‌త వ‌ల్ల ఎలాగూ వాయిదా వేయాల్సి వ‌చ్చింది. సెకండ్ వేవ్ ప్రారంభానికి ముందే అధిక భాగం షూటింగ్ పూర్త‌యింది. ఇంకా ప‌ది రోజుల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది’ అని తెలిపారు.

 ఈ చిత్రాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, పలు భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. జులై 2న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించింది చిత్ర టీమ్. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించ‌నుంది.