`దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్లని కాపాడటం సైనికుడి పని` అంటున్నారు హీరో అడవి శేష్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం `మేజర్‌`. శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. సాయీ మజ్రేఖర్‌, శోభితా దూళిపాళ్ల  హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటన ఆధారంగా, ఆ ఘటనలో పోరాడిన ఇండియన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

ఈ సినిమా టీజర్‌ని ఉగాది పండుగ సందర్భంగా సోమవారం విడుదల చేశారు. ముంబయి దాడులతో టీజర్‌ ప్రారంభమైంది. సోల్జర్‌ కి అర్థం ఏంటి? సోల్జర్‌  ఎందుకు కావాలనుకుంటున్నావ్‌.. దేశభక్తా? అని ప్రకాష్‌ రాజ్‌ అడిగే ప్రశ్నించడం, వారిని దేశభక్తులు అంటారు. బార్డర్‌లో ఆర్మీ ఫైట్‌ చేయాలి. క్రికెట్‌లో ఇండియా గెలవాలని అందరు ఆలోచిస్తారు. అదే దేశభక్తి అంటే. దేశాన్ని ప్రేమించడం అందరి పని. వాళ్లని కాపాడటం సైనికుడి పని అని, చివరి నేను వారిని హ్యాండిల్‌ చేస్తా` అని అడవి శేష్‌ చెప్పే డైలాగులు టీజర్‌లో ఆకట్టుకుంటున్నాయి. 

టీజర్‌లో బీజీఎం అదరిపోయింది. గూస్‌బమ్స్ తెప్పిస్తుంది. మొత్తంగా టీజర్‌ అందరిని ఆకట్టుకోవడంతోపాటు హంట్‌ చేస్తుంది. ఈ సినిమాని తెలుగు, హిందీ, మలయాళంలో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్ర టీజర్‌ని తెలుగులో మహేష్‌బాబు, హిందీలో సల్మాన్‌ ఖాన్‌ విడుదల చేశారు.