Asianet News TeluguAsianet News Telugu

సుప్రియతో పెళ్లిపై అడివి శేష్ కామెంట్స్!

కెరీర్ ప్రారంభం నుంచీ  విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న అడవి శేషుపై ఓ వార్త గత రెండు రోజులుగా తెలుగు మీడియాని హీటెక్కించింది. అదేంటంటే...అడవి శేషు కు వివాహం.

Adivi Sesh rubbishing talk about wedding
Author
Hyderabad, First Published Feb 20, 2019, 10:04 AM IST

కెరీర్ ప్రారంభం నుంచీ  విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్న అడవి శేషుపై ఓ వార్త గత రెండు రోజులుగా తెలుగు మీడియాని హీటెక్కించింది. అదేంటంటే...అడివి శేషు కు వివాహం. అందులో పెద్ద చెప్పుకోదగినది ఏమి లేదు. కానీ ఆయన చేసుకోబోయేది...అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియని అని తెలిసేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు.

అంతేకాదు ఆ పెళ్లి సెట్ చేస్తోంది మరెవరో కాదు...అక్కినేని వారి కోడలు సమంత అని, డెస్టినేషన్ మ్యారేజ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని కూడా కొన్ని మీడియా సంస్దలు వార్తలు రాసాయి. ఈ నేపధ్యంలో ఈ వార్తలో నిజమెంత ఉంది అని అడివి శేషుని కలిసిన ఇంగ్లీష్ డైలీకు ఆయన ఖండన ఆశ్చర్యం కలిగించింది. 

అడివి శేష్ మాట్లాడుతూ... ''ఇదొక ఆధారం లేని గాసిప్ గా కొట్టిపారేసారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు. ఎవరో వెబ్ లో క్రియేట్ చేసి వదిలిన ఓ రాండమ్ గాసిప్. అయితే దురదృష్టవశాత్తు బాగా స్ప్రెడ్ అయ్యింది'' అన్నారు. 

ఇక ఈ వార్త మొదలు కావటానికి కారణం.. అడివి శేషు తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో రీసెంట్ గా చేసిన ఓ ట్వీట్.. త్వరలోనే ఓ బిగ్ ఎనన్స్మెంట్ ఉండబోతోందని రాసుకొచ్చారు. దాంతో అది 'గూఢచారి 2' గురించి అని కొందరు ఊహిస్తే.. మరికొందరు దానికి కాస్త ఫిక్షన్ యాడ్ చేసి ఇదిగో ఇలా పెళ్లి వార్తగా మార్చేసారు.

ఈ విషయమై అడివి శేషు మాట్లాడుతూ...తను అతి త్వరలోనే ఆ ఎనౌన్సమెంట్ దేని గురించి అనేది రివీల్ చేస్తానని, ప్రస్తుతానికి తను దాని గురించి మాట్లాడకూడదని అన్నారు. 

ఇక కర్మ మూవీతో యాక్టింగ్ కెరీర్‌ని స్టార్ చేసి, పవన్ కళ్యాణ్ పంజా చిత్రంతో అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు అడవి శేషు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రంలో భద్ర అనే క్యారెక్టర్‌లో కనిపించి ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఇక ఆ తరువాత క్షణం అనే చిత్రంలో హీరోగా నటించి నటుడిగా, రచయితగా అందరి దృష్టిలో పడ్డాడు. ఇటీవ‌ల గూఢ‌చారి అనే చిత్రంతోను అల‌రించాడు. ప్ర‌స్తుతం 2 స్టేట్స్ రీమేక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు అడ‌వి శేషు. త్వ‌ర‌లో గూఢ‌చారికి సీక్వెల్ చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించాడు.  

నాగార్జున మేనకోడలితో అడివి శేష్ పెళ్లి..?

Follow Us:
Download App:
  • android
  • ios