టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో అడివి శేషు (Adivi Sesh) ‘మేజర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల ఇంటర్వ్యూల్లో బిజీగా ఉన్న శేషు.. తాజాగా తన లవ్ ట్రాక్ ను రివీల్ చేశారు.
తెలుగువాడైన అడివి శేష్.. ఇండియాలో పుట్టిన పెరిగింది.. చదువుకుంది అంతా అమెరికాలోనే. నటుడు కావాలనే ఆసక్తి.. స్వశక్తితో ఎదగాలనే పట్టుదలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అడివి శేషు. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సినిమాల్లో కనిపించాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ చిత్రంలో నెగెటివ్ రోల్ తో అలరించాడు. అప్పటి నుంచి అడివిశేషుకు చిత్ర సీమలో మంచి తరుణం ప్రారంభమైంది.
అప్పటి వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న శేషు.. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు అద్భుతమైన రైటింగ్ స్కిల్ ను కూడా బయటపెట్టాడు. ‘కర్మం, కిస్, క్షణం, గూఢాచారి, మేజర్’ చిత్రాలకు కథను అందించారు. తను కథలు అందించిన మూడో చిత్రం ‘క్షణం’తో హిట్ అందుకున్నాడు శేషు, ఆ తర్వాత వచ్చిన ‘గూఢాచారి’తోనూ సాలిడ్ హిట్ తన ఖాతాలో చేరింది. ఇప్పుడు మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణణ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘మేజర్’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.
Major చిత్రంలో అడివి శేషు ప్రధాన పాత్ర పోషించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు సొంత బ్యానర్ జీఎంబీ ఎంటర్ టైనర్ పై చిత్రాన్ని నిర్మించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అయితే చిత్రం హిట్ కొట్టిన సందర్భంగా అడివి శేషు, చిత్ర యూనిట్ ఫుట్ ఖుషీ అవుతున్నారు. శేషు పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఈక్రమంలో తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
తెలుగు వాడినైనా తను పెరిగింది మొత్తం అమెరికాలోనేనని తెలిపారు. అక్కడే స్టడీస్ కంప్లీట్ చేశానని, సినిమాలపై ఉన్న ఆసక్తితోనే ఇండియాకు తిరిగి వచ్చినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో 20 ఏండ్లుగా ప్రయాణం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. శేషు మాట్లాడుతూ తన లవ్ ట్రాక్ ను కూడా రివీల్ చేశారు. ‘యూఎస్ లో నివసిస్తున్నప్పుడు ఓ పంజాబీ అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు. కొన్ని కారణాలతో విడియపోయామన్నారు. తన పుట్టిన రోజునే ఆ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని రివీల్ చేశాడు. ఆ తర్వా త కూడా రిలేషన్ షిప్ మెయింటేయిన్ చేశాడని చెప్పాడు. కానీ పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం రాలేదన్నారు.’ ప్రస్తుతం సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు తెలిపాడు. త్వరలో తన చెల్లి పెళ్లి జరగనుందని, ఆ పనుల్లోనే బిజీగా ఉన్నట్టు తెలిపాడు.
