టాలెంటెడ్ హీరో అడివి శేష్, హీరోయిన్ సాయీ మంజ్రేఖర్ జంటగా నటించిన చిత్రం ‘మేజర్’. ఈ మూవీ రిలీజ్ కు సిద్ధమవడంతో మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అప్డేట్ అందించారు.
అడవి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన చిత్రం `మేజర్` (Major). శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందుతున్న బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రమిది. సాయీ మంజ్రేఖర్ (Saiee Manjrekar), శోభితా దూళిపాళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటనలో పోరాడిన ఇండియన్ మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మరో వారంలో రిలీజ్ కానున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను మేకర్స్ చాలా ఆసక్తి చేస్తున్నారు. సినీ చరిత్రలోనే తొలిసారిగా రిలీజ్ డేట్ కు ముందే ఆడియెన్స్ కోసం దేశ వ్యాప్తంగా పలు తొమ్మిది ప్రధాన నగరాల్లో ప్రీ ప్రీమియర్ షోను వేస్తున్నారు. మే 24 నుంచి స్టార్ట్ అయిన ఈ స్పెషల్ స్క్రీనింగ్ నేటితో ముగియనుంది. చివరి షోను మేకర్స్ వైజాగ్ లోని సంగం సరత్ థియేటర్ లో వేయనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో షో అనంతరం అక్కడే గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ప్రేక్షకుల సమక్షంలో నిర్వహించనున్నట్టు కన్ఫమ్ చేశారు.
అయితే ఈ స్పెషల్ షోకు ఇంకా టికెట్స్ అవలెబుల్ లోనే ఉన్నాయని, అభిమానులు త్వరగా బుక్ చేసుకోవాలని హీరో అడివి శేష్ సూచించారు. మొదటి నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ‘మేజర్’.. ప్రస్తుతం ఆడియెన్స్ నుంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. కాగా, జూన్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, మళయాళంలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ షెడ్యూల్ చేశారు.
