నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ నటించిన హిట్ చిత్రం గుర్తుందిగా.. ఆ మూవీ మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది.
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా విశ్వక్ సేన్ నటించిన హిట్ చిత్రం గుర్తుందిగా.. ఆ మూవీ మంచి విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ హిట్ 2గా తెరెకెక్కింది. తాజాగా విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
అడివి శేష్ పోలీస్ అధికారిగా డిఫెరెంట్ యాటిట్యూడ్ తో కనిపిస్తున్నారు. టీజర్ మొత్తం ఫన్నీగా సాగినా చివర్లో క్రైమ్ అంశాలతో ఒళ్ళు గగుర్పాటుకి గురవుతుంది. మొత్తంగా టీజర్ హిట్ 2పై అంచనాలు పెంచేసింది. టీజర్ లాంఛ్ కార్యక్రమంలో అడివి శేష్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.
అల్లు అర్జున్ నుంచి మహేష్ బాబు వరకు తాను అందరు హీరోలకు నచ్చే హీరో అని చెప్పుకున్నాడు. తాను నటించిన ఎవరు, గూఢచారి చిత్రాల ట్రయిలర్ లాంచ్ చేసింది నానినే. కానీ ఈసారి ట్రైలర్ లాంచ్ చేయను.. ఏకంగా నీతో సినిమా ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు. అలా హిట్ 2లో నటించమని అడిగారు.
డైరెక్టర్ కైలేష్ కొలను ఈ కథని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. సిల్వర్ స్క్రీన్ పై ఈ చిత్రం చాలా బావుంటుంది. భయపెడుతుంది అని అడివి శేష్ పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి గురించి అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముంబై అమ్మాయిలు ప్రెట్టీ గర్ల్స్. అలా వస్తారు 1..2.. 3 హాయ్ అంటారు.. క్యార వ్యాన్ లోకి వెళ్ళిపోతారు. కానీ మీనాక్షి అలా కాదు. ముంబై నటీమణులు కేవలం నమస్కారం మాత్రమే తెలుగులో చెబుతారు. మీనాక్షి మాత్రం తెలుగులో మాట్లాడడానికి తన స్పీచ్ రాసుకుని వచ్చింది. టీజర్ ఈవెంట్ కే మీనాక్షి ఇంత ఎఫర్ట్ పెట్టింది అంటే సినిమాకి ఇంకెత ఎఫర్ట్ పెట్టిందో అర్థం చేసుకోవచ్చు అంటూ అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
