Asianet News TeluguAsianet News Telugu

పవన్ ప్రాజెక్టుపై అడవి శేషు ఇంట్రస్టింగ్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇక ఈ సినిమా ప్రకటనతో పలువురు సినీప్రముఖులు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. 

Adivi Sesh comments on Pawan new film
Author
First Published Dec 5, 2022, 10:37 AM IST


 ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకోవడంతో నిర్మాత డివివి దానయ్య తదుపరి సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటించి సోషల్ మీడియా మొత్తని ఒక ఊపు ఊపేశాడు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ కొత్త పోస్టర్ ను ఆదివారం రిలీజ్ చేస్తూ.. పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారని క్యాప్షన్ ఇచ్చింది.

ఈ పోస్టర్ లో పవన్ వెనకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తారని సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ తెలిపింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇక ఈ సినిమా ప్రకటనతో పలువురు సినీప్రముఖులు చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కూడా పవన్ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు.

మరో ప్రక్క ఈ కొత్త ప్రాజెక్ట్‌పై పవర్‌స్టార్  వీరాభిమాని అడివి శేష్ కొన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్  చేశారు. ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ స్టార్లు సుజీత్‌ను సినిమా చేయమని సంప్రదించారని, అయితే ఆ యువ దర్శకుడు తెలుగు సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించాడని ఆయన వెల్లడించారు.

అడివి శేష్ మాట్లాడుతూ మూడేళ్ల విరామం తర్వాత సుజీత్‌కి అందరికీ ఇష్టమైన పవన్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌పై పవన్ తనయుడు అఖిరా నందన్ చాలా ఆసక్తిగా ఉన్నారని ఆయన అన్నారు. అలాగే ..సుజీత్ ....పవన్‌కి పెద్ద అభిమాని అని పేర్కొన్నాడు మరియు ఈ స్టార్ హీరోని ఎలా ప్రెజంట్  చేయాలో  సుజీత్‌కు తెలుసు అని చెప్పాడు.

Follow Us:
Download App:
  • android
  • ios