నేటి కాలంలో ఏ విషయం తెలుసుకోవాలన్నా.. ముందుగా గూగుల్ చేయడం అందరికీ అలవాటు. సెలబ్రిటీలైతే.. తమ పేరుని గూగుల్ చేసి వారికి సంబంధించి ఏం వార్తలు వస్తున్నాయో తెలుసుకుంటూ ఉంటారు. అయితే హీరోయిన్ అదితి రావు హైదరి మాత్రం గూగుల్ లో తన పేరుని సెర్చ్ చేయనని చెబుతోంది.

తాజాగా ఓ చాట్ షోలో పాల్గొన్న అదితిరావు ఈ విషయాన్ని వెల్లడించింది. 2011 లో వచ్చిన 'యే సాలీ జిందగీ' అనే సినిమాతో అదితిరావు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఆ సమయంలో తన గురించి సరదాగా గూగుల్ లో వెతకాలని.. పేరుని సెర్చ్ చేస్తే సినిమాలో దుస్తుల్లేకుండా ఉన్న కొన్ని ఫోటోలు కనిపించడం షాక్ అయ్యాయని అదితి తెలిపింది. తన వీపు భాగాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటించింది. దానికి సంబంధించిన ఫోటోలనే గూగుల్ కూడా చూపించింది. అయితే అదితి మాత్రం ఇంకెప్పుడూ తన గురించి గూగుల్ లో వెతకకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తోన్న 'వి' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో నాని, సుదీర్ బాబు హీరోలుగా కనిపిస్తున్నారు. అలానే తమిళంలో 'సైకో' అనే మరో సినిమాలో నటిస్తోంది.