హైదరాబాద్ అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అలానే తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించింది. 'సమ్మోహనం' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం 'వి' అనే మరో సినిమాలో నటిస్తోంది.

అలానే తమిళంలో ఉదయనిధి స్టాలిన్ కు జంటగా.. 'సైకో' అనే చిత్రంలో నటిస్తోంది. మిస్కిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  తనకు డేటింగ్ ఎలా చేయాలో తెలియదని చెప్పింది అదితి.

చిన్నప్పటి తన ప్రేమ వ్యవహారం గురించి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంటూ.. 5వ తరగతి చదువుతున్నప్పుడే తన సీనియర్ ప్రేమలేఖ రాశాడని చెప్పుకొచ్చింది. అప్పుడు తన వయసు 9 ఏళ్లని పేర్కొంది. ప్రేమ అంటే ఏమిటో తెలియని వయసులో అతడు రాసిన రెండు పేజీల ప్రేమలేఖను తీసుకెళ్లి గర్వంగా తన తల్లికి ఇచ్చానని చెప్పింది.

అయితే అంతే ఫాస్ట్ గా తనను బోర్డింగ్ స్కూల్ లో చేర్పించారని తెలిపింది. తనకు 21 ఏళ్ల వయసులో పెళ్లి జరిగిందని, ఎలా డేటింగ్ చేయాలో కూడా తెలియలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ పక్క సినిమాలతో మరో పక్క గ్లామరస్ ఫోటో షూట్ లతో బిజీగా గడుపుతోంది.