ప్రభాస్‌ ప్రతిష్టాత్మకంగా నటించబోతున్న చిత్రాల్లో `ఆదిపురుష్‌` ఒకటి. డైరెక్ట్ హిందీ చిత్రమిది. పాన్‌ ఇండియా సినిమాతో పౌరాణికం నేపథ్యంలో రూపొందబోతుంది. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దీన్ని త్రీడీలో తెరకెక్కించనున్నారు. టీ సిరీస్‌పై భూషణ్‌ కుమార్‌, కిషణ్‌ కుమార్‌ దీన్ని నిర్మించనుంది. 

ఇందులో విలన్‌గా సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్నారు. ఇక సినిమాలో ప్రభాస్‌ రాముడిగా, సైఫ్‌ రావణుడిగా కనిపించనుండగా, సీత ఎవరు అనేది సస్పెన్స్ నెలకొంది. అనుష్క శర్మ, దీపికా పదుకొనె, అనుష్క వంటి పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరు ఫైనల్‌ అవుతారన్నది సస్పెన్స్ నెలకొంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ని పంచుకున్నాడు ప్రభాస్‌. సినిమా విడుదల తేదీని వెల్లడించారు. సినిమా ప్రారంభమే కాలేదు, అప్పుడే విడుదల తేదీని నిర్ణయించారు. 2022లో ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్టు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా వచ్చే ఏడాది జనవరిలో పట్టాలెక్కనుంది. దీంతో ప్రభాస్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.