Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. కౌంట్ డౌన్ స్టార్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆదిపురుష్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. ఈవిషయం తెలిసి దిల్ ఖుష్ అవుతున్నారు ఫ్యాన్స్. 

Adipurush Reaffirms June 16 As Release Date 150 Days To Go
Author
First Published Jan 17, 2023, 10:12 PM IST

ప్రభాస్ ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యేలాంటి న్యూస్ వినిపించారు ఆదిపురుష్ టీమ్. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఎదరు చూస్తున్న ఆదిపురుష్ రిలీజ్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా రేంజ్ లో.. ప్రభాస్ నటిస్తున్న సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో రూపు దిద్దుకుంటున్న ఈసినిమాపై దేశ వ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈమూవీ ఈ ఏడాది రిలీజ్ కు రెడీగా ఉంది. గత ఏడాది ఈ సినిమా టీజర్‌ని కూడా లాంచ్‌ చేయగా, వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా రిలీజ్ కాస్త లేట్ అవుతూ వస్తోంది. షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అవ్వగా.. రిలీజ్ పై క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరూత్సాహపడ్డారు. ఈక్రమంలో వీటన్నింటికి చెక్ పెట్టారు మేకర్స్. 

లాస్ట్ ఇయర్ ఓ సందర్భంలో ఆదిపురుష్ ను   జూన్ 16, 2023న రిలీజ్ చేయబోతున్నట్టు  ప్రకటించారు మేకర్స్.  అయితే గ్రాఫిక్స్ వర్క్ కు కు ఇంకా టైమ్ పడుతుందని.. దాంతో.. ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదల కాకపోవచ్చు అనే వార్తలు మళ్లీ వినిపించాయి. ఇక ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ.. ఫ్రెష్ గా ప్రకటన చేశారు ఆదిపురుష్ మేకర్స్.  ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్ 16 రిలీజ్ చేస్తామంటూ.. అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అంతే కాదు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు.

 

రిలీజ్ ఇంకా 150 రోజులు ఉంది అంటూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు టీమ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్  అభిమానుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడంకోసం రెడీ అవుతున్నారు ఆదిపురుష్ టీమ్. రాముడిగా ప్రభాస్‌  150 రోజులు ఆగాల్సిందే. ఇక ఆదిపురుష్  సినిమాలో ప్రభాస్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది. ఈ సినిమా ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కించారు. రూపొందించబడింది. తన్హాజీ సినిమాతో తన టాలెంట్ చూపించి దర్శకుడు ఓం రౌత్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించబోతున్నారు.  సన్నీ సింగ్ మరియు సోనాల్ చౌహాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇక ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ అవుతుండగా.. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్నసలార్ కూడా రిలీజ్ కు ముస్తాబుతుంది. ఈ సినిమాతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కే.. సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. దానితో పాటు సందీప్ వంగాతో స్పిరిట్ షూటింగ్ కు వెళ్ళాళ్సి ఉండగా.. ఆల్ రెడీ మారుతీ డైరెక్షన్ లో రాజా డీలక్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది కూడా. ఇలా వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ.. ఏమాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. 

Follow Us:
Download App:
  • android
  • ios