నెల రోజుల ముందే ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేసింది  `ఆదిపురుష్‌` యూనిట్‌. ఇక వరుసగా సాంగ్స్, ఇతర ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ చేస్తుంది. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. `ఆదిపురుష్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. 

ప్రభాస్‌ నటిస్తున్న మైథలాజికల్‌ మూవీ `ఆదిపురుష్‌` వచ్చే నెలలో రిలీజ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. నెల రోజుల ముందే ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేసింది యూనిట్‌. ఇక వరుసగా సాంగ్స్, ఇతర ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ చేస్తుంది. తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. `ఆదిపురుష్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. 

లొకేషన్‌, డేట్‌ని కూడా నిర్ణయించింది. జూన్‌ 6న తిరుపతిలో ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్టు వెల్లడించింది. తిరుపతి గ్రౌండ్‌లో ఈవెంట్‌ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్టు తెలిపింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషి అవుతున్నారు. ఇటీవల విడుదలైన `జై శ్రీరామ్‌` సాంగ్‌ ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. దీన్నొక సెలబ్రేషన్‌ లా భావిస్తున్నారు ఆడియెన్స్. మాస్‌ ఆడియెన్స్ లోకి ఇది బాగా వెళ్లింది. 

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కి రాముడిగా కనిపిస్తున్నారు. కృతి సనన్‌ సీత పాత్రలో నటిస్తుంది. రావణుడి పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌ చేస్తున్నారు. ఓ రౌత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 16న విడుదల కానుంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో గ్రాండ్ గా రిలీజ్‌ చేయబోతున్నారు. నెవర్‌ బిఫోర్‌ అనే రేంజ్‌లో `ఆదిపురుష్‌` సినిమా రిలీజ్‌ ఉండబోతుండటం విశేషం. 

ఇక `ఆదిపురుష్‌` టీజర్‌ విడుదలైనప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. వీఎఫెక్స్ క్వాలిటీ లేవని,పైగా మోషన్‌ పిక్చర్‌ టెక్నాలజీ సెట్‌ కాలేదని అన్నారు. దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. అయితే `ట్రైలర్‌తో వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ట్రైలర్‌ రియాలిటీకి దగ్గరగా ఉంది. దీంతో ఆడియెన్స్ రిసీవ్‌ చేసుకున్నారు. విమర్శలు చాలా వరకు తగ్గాయి. దీన్ని ప్రమోషనల్‌గా వాడుకుంటున్నారు. అయితే బిజినెస్‌ విషయంలోనే ఈ సినిమా వెనబడిందనే టాక్‌ ఉంది. మరి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఏ రేంజ్‌లో సత్తాని చాటుతుందో చూడాలి. 

`బాహుబలి2` తర్వాత ప్రభాస్‌కి సాలిడ్‌ హిట్‌ పడలేదు. యాక్షన్‌ మూవీ `సాహో` యావరేజ్‌గానే మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన `రాధేశ్యామ్‌` డిజాస్టర్‌ ఖాతాలో పడింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. వారిని `ఆదిపురుష్‌`తో సాటిస్పై చేయాలని టీమ్‌ భావిస్తుంది.