ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న వాటిలో `ఆదిపురుష్‌` సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా బడ్జెట్‌ని రివీల్‌ అయ్యింది. 

డార్లింగ్‌ ప్రభాస్‌.. పాన్‌ ఇండియా స్టార్‌ని దాటుకుని గ్లోబల్‌ స్టార్‌ ముద్ర వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు `సలార్‌`, `ఆదిపురుష్‌`, `ప్రాజెక్ట్ కే` విడుదలై విజయం సాధిస్తే, కచ్చితంగా ఆయనపై గ్లోబల్‌ స్టార్‌ ముద్ర బలంగా పడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతటి బలమైన కంటెంట్‌తో, అంతటి లార్జ్ స్కేల్‌లో రూపొందుతున్న చిత్రాలివి. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది నుంచే సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే ప్రభాస్‌ `రాధేశ్యామ్‌`తో అలరించిన విషయం తెలిసిందే. 

ఇక ప్రభాస్‌ ప్రస్తుతం నటిస్తున్న వాటిలో `ఆదిపురుష్‌` సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా బడ్జెట్‌ని రివీల్‌ అయ్యింది. సినిమాని నిర్మిస్తున్న బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ `ఆదిపురుష్‌` కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్‌ ఎంతో వెల్లడించారు. ఏకంగా ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు నిర్మాత భూషణ్‌ కుమార్‌ చెప్పారనే వార్తలు ఇప్పుడు సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతున్నాయి. ఇది ఇప్పటి వరకు ఇండియాలో రూపొందిన చిత్రాల్లోనే అత్యధికమైన బడ్జెట్‌ అని అంటున్నారు విశ్లేషకులు. 

ఇప్పటికే విడుదలై భారీ సినిమాలు `బాహుబలి` మొదటి పార్ట్ కి 150కోట్లు, రెండో పార్ట్ సుమారు మూడు వందల కోట్ల లోపు ఖర్చు చేశారు. ఇక `ఆర్‌ఆర్‌ఆర్‌` నాలుగువందల యాభై కోట్ల వరకు ఉంటుంది. మరోవైపు `కేజీఎఫ్‌2` కూడా మూడువందల కోట వరకు పరిమితం. కానీ ఈ సినిమాలు సృష్టించిన సంచలనాలు ఎంతో తెలిసిందే. ఇక `ఆదిపురుష్‌` మూవీని మాత్రం ఐదు వందల కోట్లతో నిర్మిస్తున్నట్టు చెప్పి షాకిచ్చాడు నిర్మాత. భారీ విజువల్‌ వండర్‌గా ఈ సినిమా ఉండబోతుందట. కనీవినీ ఎరుగని రీతిలో విజువల్స్ ఉంటాయని టాక్‌. విజువల్‌ ఎఫెక్ట్స్ వరల్డ్ క్లాస్‌ క్వాలిటీతో డిజైన్‌ చేస్తున్నట్టు సమాచారం. 

ఇక ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న `ఆదిపురుష్‌` చిత్రాన్ని టీ సిరీస్‌ నిర్మిస్తుంది. భూషణ్‌ కుమార్‌ నిర్మాత. రామాయణం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులో రాముడిగా ప్రభాస్‌ నటిస్తున్నారు. ఆయనకు జోడీగా సీత పాత్రలో కృతి సనన్‌ నటిస్తుంది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు. మైథలాజికల్‌ మూవీ కావడంతో కాస్ట్యూమ్స్, విజువల్‌కి స్కోప్‌ ఉంటుంది. భారీగా సెట్స్ వేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో యూనిట్‌ చాలా కేర్‌ తీసుకున్నారని, రాజీ లేకుండా నిర్మించారని తెలుస్తుంది. ఈ సినిమాపై అభిమానుల్లో,సినిమా వర్గాల్లోనూ భారీ అంచనాలున్నాయి. 

Scroll to load tweet…

సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. కనీసం ఫస్ట్ లుక్‌ కూడా విడుదల చేయలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అప్‌డేట్లు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. కానీ దీనిపై యూనిట్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. అయితే అక్టోబర్‌ నుంచి ప్రమోషన్‌ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తామని నిర్మాత తెలిపారు. మరోవైపు ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో `సలార్‌` చిత్రాన్ని కూడా 300-400కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారట. అలాగే `ప్రాజెక్ట్ కే`ని మాత్రం ఐదు వందల కోట్లబడ్జెట్‌ టార్గెట్‌గా తెరకెక్కిస్తున్నట్టు యూనిట్‌ తెలిపింది. కానీ ఇప్పుడున్న లెక్కల ప్రకారం `ఆదిపురుష్‌`సినిమానే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా నిలుస్తుందని చెప్పొచ్చు.