ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో ఫక్తు రామభక్తుడిలా ఓం రౌత్ మాట్లాడాడు. హనుమంతుడు కోసం ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీగా ఉంచాలని నిర్మాతలను కోరాడు. అయితే ఇదంతా జస్ట్ నాటకమే అని తెలుస్తుంది...
ఆదిపురుష్ మూవీపై లెక్కకు మించిన వివాదాలు. టీజర్ విడుదలతో మొదలైన వ్యతిరేకత కొనసాగుతుంది. చిత్ర విడుదల అనంతరం మరిన్ని అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. అయితే ఆదిపురుష్ చిత్ర కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. టాక్ తో పోల్చుకుంటే మెరుగైన వసూళ్లు రాబడుతుంది. కాగా ఓం రౌత్ ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుకలో ఎమోషనల్ అయ్యాడు. రామాయణం ప్రదర్శించే ప్రతిచోటకు హనుమంతుడు వస్తాడని మా అమ్మ చెప్పింది. కాబట్టి ఆదిపురుష్ ఆడుతున్న ప్రతి థియేటర్లో ఒక సీటు ఖాళీగా ఉంచాలంటూ నిర్మాతలను విజ్ఞప్తి చేశాడు.
అందుకు నిర్మాతలు ఓకే చెప్పారు. దాంతో ఓం రౌత్, రాముడికి, హనుమంతుడికి గొప్ప భక్తుడని అందరూ భావించారు. అసలు విషయం తెలిశాక అందరి మైండ్స్ బ్లాక్ అయ్యాయి. 2015లో ఓం రౌత్ ఒక ట్వీట్ వేశాడు. సదరు ట్వీట్లో ... 'హనుమంతుడు ఏమైనా చెవిటి వాడా? నా చుట్టుపక్కల వాళ్ళు అదే భావిస్తున్నారు. అందుకే భారీ సౌండ్స్ తో హనుమాన్ జయంతి రోజు పాటలు పెడుతున్నారు. ఆది కూడా సంబంధం లేని పాటలు పెడుతున్నారు' అని కామెంట్ చేశాడు.
రామదూత హనుమాన్ ని చెవిటి వాడన్న ఓం రౌత్, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ట్వీట్ చేశాడు. గతంలో హిందూ మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఓం రౌత్ వేసిన ట్వీట్ కొందరు బయటకు తీశారు. సోషల్ మీడియా వేదికగా అతనిపై విమర్శలు గుప్పించారు. దాంతో సదరు ట్వీట్ డిలీట్ చేశాడు. ఓం రౌత్ ట్వీట్ వెలుగులోకి వచ్చాక... అతని మాటలన్ని నాటకం అంటున్నారు. కేవలం ఆదిపురుష్ చిత్ర ప్రమోషన్స్ కోసం హనుమాన్ కోసం ఒక సీటు అంటూ రెలిజియస్ బ్లాక్ మెయిల్ చేశాడు. అంతే కానీ తనకు ఎలాంటి మత విశ్వాసాలు లేవని కొందరు అంటున్నారు.
