Asianet News TeluguAsianet News Telugu

Padamati Sandhya Ragam:జానకిని దోషిని చేస్తున్న కుటంబసభ్యులు.. ప్రేమించడంలేదని చెప్పి శీనుకి షాకిచ్చిన ఆద్య!

Padamati Sandhya Ragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ అందరి హృదయాలని దోచుకుంటూ మంచి రేటింగ్ తో ముందుకు దూసుకుపోతోంది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంతో సాగుతున్న ఈ కథ టాప్ సీరియల్స్ కి మంచి పోటీ ఇస్తుంది. ఇక ఈరోజు మార్చి 18 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Adhya gives ultimatum to srinu about her love in todays padamati sandhyaragam serial episode gnr
Author
First Published Mar 18, 2023, 2:55 PM IST

ఎపిసోడ్ ప్రారంభంలో శ్రీను కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్స్ ఇప్పట్లో లేవంట అంటాడు రఘురాం. అబద్ధం చెప్పి వెళ్ళవలసిన అవసరం వాడికి  ఏమొచ్చింది అంటాడు రఘురాం తమ్ముడు. శ్రీను ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలుస్తుంది అని అడుగుతాడు రఘురాం. ఇంకెవరికి వదినకి తెలుస్తుంది అంటుంది పద్మ తను ఎక్కడికి వెళ్ళింది నాకు ఎలా తెలుస్తుంది అంటుంది జానకి.

వాడు నా మాట కంట నీ మాటకే ఎక్కువ విలువిస్తాడు నువ్వు ఎందుకు వాడిని నిలదీయలేదు అంటుంది పద్మ. పరీక్షలు అని చెప్పి వెళ్ళాడు కదా అందుకే నిలదీయలేదు అంటుంది జానకి. నీకు నిజం తెలిసే ఉంటుంది తెలిస్తే చెప్పు అని జానకి తోటి కోడలు కూడా నిలదీస్తుంది.  నాకేం తెలీదు కానీ జానకి అంటే మరీ ఎవరికి తెలుస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళాడు ఎవరు సమాధానం చెప్తారు.

ఈ మధ్య తను అదొకలా ఉంటున్నాడు ఏమైంది అని అడిగితే మాట దాటవేస్తున్నాడు, ఏదో దాస్తున్నాడని అర్థమవుతుంది  అంటాడు రఘురాం. నిజం తెలిసిన వాళ్ళు నిజాయితీగా చెప్తే బాగుంటుంది అని రఘురాం అంటే ప్రమాణస్పూర్తిగా నాకేమీ తెలియదు అంటుంది జానకి. నేను అడిగినప్పుడు కూడా ఏం లేదు అంతే బానే ఉంది అని చెప్పాడు అంటుంది రామలక్ష్మి.

బస్సు ఎక్కే ముందు కూడా ఏదో పోగొట్టుకునే వాడిలాగా ఉన్నాడు ఉండిపోరా అంటే వెళ్ళాలి అంటాడు పరీక్షల కోసమే కదా అని ఊరుకున్నాను అంటాడు శ్రీనివాస్ రావు. నీతో ఎలా ఉంటున్నాడు, ప్రేమగానే ఉంటున్నాడా, ఏది దాచకుండా నిజం చెప్పు అని చారుని అడుగుతాడు రఘురాం. నాతో ప్రేమగా ఉండటం లేదు, సరిగ్గా మాట్లాడటం కూడా లేదు. ఆద్య బాధతో చదువుతూ నాకు బావని దూరం చేస్తుంది అంటుంది చారు.

అది ఇలాంటి పనేదో చేస్తుందని ముందు నుంచి అనుమానం గానే వుంది అంటుంది పద్మ. తను ఎక్కడుందో పిలవండి అంటాడు రఘురాం. జానకి పిలిచిన పలకదు. ఎందుకు పలుకుతుంది తనకి కొవ్వు నేను వెళ్లి తీసుకువస్తాను అంటూ వెళ్తుంది పద్మ. ఆధ్య గదిలో లేదు అంటూ కంగారుగా రఘురాం కి చెప్తుంది పద్మ. ఎక్కడికి వెళ్లావు ఎక్కడ నీ మీద నేను పోనీ ఉందని పడుతున్నాయి త్వరగా వచ్చేసేయ్ అనుకుంటుంది  రామలక్ష్మి.

 శీను లేడు ఆధ్య కూడా ఇంట్లో లేదు అంటూ అనుమానంగా మాట్లాడుతుంది పద్మ. మరోవైపు నేను ఈ ఇంటికి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా అని శీను ని  అడుగుతుంది ఆద్య. మీ అమ్మ చనిపోయింది అందుకే రావాల్సి వచ్చింది అంటాడు శీను. ఇంట్లో నేనంటే ఎంతమందికి ఇష్టం అంటుంది ఆద్య. ఇవన్నీ నన్నెందుకు అడుగుతున్నావు అంటాడు శీను అడిగిందానికి సమాధానం చెప్పు.

ఇంట్లో కొందరు ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు అంటుంది ఆద్య. మీ అమ్మగారు కిషోర్ గారిని తీసుకొని వెళ్ళిపోవడం వల్ల అంటాడు శీను. మరి నువ్వు చేస్తున్నదేంటి అదే కదా అంటుంది ఆద్య. అదే తప్పులు నన్ను కూడా చేయమంటావా అంటూ నిలదీస్తుంది. మా అమ్మకి నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది చారుకి నేనంటే ఉన్న ప్రేమ తెలుస్తుంది. కానీ నీ మీద నాకున్న ప్రేమ వాటన్నిటిని దాటి ముందుకు వెళ్ళమని చెప్తుంది అంటాడు శీను.

ముందుకి వెళ్లలేము అంటుంది ఆద్య. మీ కుటుంబాన్ని కాదని మనం ఎక్కడికైనా వెళ్లి సంతోషంగా ఉన్నాము అప్పుడు కుటుంబం ఏమైపోయినా పర్వాలేదా అంటుంది ఆద్య అలా ఎలా అంటాను అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుందామంటాను అంటాడు శీను. ఒక అమ్మాయి తో ఎంగేజ్మెంట్ అయిన నీకు,నాతో పెళ్లి అంటే ఒప్పుకుంటారా అంటుంది ఆద్య. అదంతా కాదు నేనంటే నీకు ఇష్టము కాదు చెప్పు అంటాడు శీను.

నువ్వంటే నాకు ఇష్టమే అంటుంది ఆద్య. మరోవైపు కుటుంబం పరువు రోడ్డున పడేలాగా చేసావు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వీధిలోకి వెళ్తాం అంటూ గోల పెడుతుంది పద్మ. అసలు దీనంతటికీ కారణం అంటూ జానకి వైపు చూస్తూ సమాధానం చెప్పమని నిలదీస్తుంది పద్మ. కానీ వద్దు వద్దు అంటే ఇంట్లో తెచ్చి పెట్టావు బయటికి పంపించమని చెప్తే వినలేదు ఇప్పుడు చూసావా అది ఎంత పని చేసిందో దీనికి సమాధానం ఎవరు చెప్తారు అంటూ ఆవేశపడుతుంది.

సమాధానం చెప్పు ఎవరు చెప్పినా వినకుండా ఆఖరికి రఘురాం కి అబద్దం చెప్పి తనని ఇంట్లో ఉండేలాగా చేసావు, చివరికి ఇంత నమ్మలాగే అది కూడా దాని బుద్ధిని చూపించింది అంటూ అసహ్యంగా మాట్లాడుతుంది జానకి అత్తగారు. దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి అత్తయ్య అంటూ కన్నీరు పెట్టుకుంటుంది జానకి. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మీకు మీరే ఏదేదో ఊహించుకుంటున్నారుఅంటుంది జానకి.

గదిలో ఉండవలసిన ఆధ్యా గదిలో లేదు ఇంట్లో ఉండవలసిన శీను ఊరికి వెళ్ళాడు. కనిపిస్తుంటే ఊహించుకుంటున్నారు అంటావేంటి అంటుంది పద్మ. నిజా నిజాలు తెలుసుకోకుండా ఎందుకలా ఆవేశపడతావ్ అంటూ పద్మ ని మండలిస్తాడు ఆమె తమ్ముడు. మీకేమీ తెలీదు ఆ ఆధ్య, శీనుతో చనువుగా ఉండడాన్ని నేను పద్మా వదిన చాలాసార్లు చూశాము. చారుకి చినుకి మధ్య అధ్యా అడ్డుగా వస్తుంది అంటుంది జానకి తోటి కోడలు.

అవును పెదనాన్న మీకు చెబుదామనుకున్నాను కానీ గొడవలు అవుతాయని చెప్పలేదని అంటుంది చారు. చారు చెప్పింది కూడా అబద్ధమేనా అంటూ జానకిని నిలదీస్తుంది పద్మ. తను చెప్పింది అబద్ధమే, సీనయ్య ఎలాంటివాడో ఆధ్యా ఎలాంటిదో నాకు బాగా తెలుసు వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు నన్ను నమ్మండి అంటూ వాళ్ళని వెనకేసుకొస్తుంది జానకి.

మరోవైపు నేనంటే ఇష్టమని ఒప్పుకున్నందుకు థాంక్యూ అంటూ ఎగ్జైట్ అవుతాడు శీను. నేను చెప్పేది పూర్తిగా విను నువ్వంటే ఇష్టమే కానీ నువ్వు అనుకునే ఇష్టం కాదు అంటుంది ఆద్య. నేను అనుకునే ఇష్టం ఏంటో చెప్పు అంటాడు శీను. నువ్వే చెప్పు అంటుంది ఆద్య. మనిద్దరం పెళ్లి చేసుకోవాలి మన లైఫ్ లో సంతోషం తప్పితే బాధ లేకుండా చేయాలి అది నేను అనుకునే ఇష్టం అంటాడు శీను.

అది ఎప్పటికీ జరగదు, ఎందుకంటే మా అమ్మ చేయని తప్పుకి నింద వేశారు ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ నిందనే నిజం చేసిన దాన్ని అవుతాను. అందుకే నాకు ఇష్టం లేదు అంటుంది ఆద్య. నేనంటే ఇష్టమే కానీ పెళ్లి చేసుకోను అంటావు అంతే కదా మరి నన్ను తీసుకెళ్లటానికి  ఎందుకు వచ్చావు అంటాడు శీను. నువ్వు నాకోసం ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా బాధపడటం ఇష్టం లేదు.

నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళిన తర్వాత మీ అమ్మ వాళ్ళు ఒంటరిగా ఫీలవుతారు అక్కడికి వెళ్లిన తర్వాత నువ్వు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టలేవు నా గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటావు. అది నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు అందరికన్నా ఎక్కువగా నేను హ్యాపీగా ఉంటాను అంటుంది తర్వాత ఏం జరిగిందో ఎపిసోడ్ లో చూద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios