ర‌విబాబు న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమాలో పంది పిల్ల(బంటీ) కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంది. రీసెంట్ గా విడుదలైన టీజర్ ప్రేక్షకుల దృష్టి ఆకర్షించింది. ఇందులో పంది పిల్లతో డాన్స్ చేయించారు. తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

ఇందులో బంటీ తనను ఇబ్బంది పెట్టేవారికి చుక్కలు చూపిస్తుంది. బంటీని చంపడానికి ప్రయత్నించే వారిని ముప్పుతెప్పలు పెట్టడం ట్రైలర్ లో చూపించారు. అంతేకాదు ట్రైలర్ లో ఒక పంది మరో పందిని.. ''రేయ్ పంది ఒకసారి చెప్తే అర్ధం కాదా..? మనిషిలా పదిసార్లు చెప్పించుకుంటావా..?'' అని చెప్పే డైలాగ్ తో మనుషులపై సెటైర్ వేశాడు రవిబాబు. ట్రైలర్ చివరిలో బంటీని ఎత్తుకొని ఒక ఫ్రేమ్ లో రవిబాబు కూడా కనిపించారు.

ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌లోనే తొలి సారి పూర్తి స్థాయి లైవ్ యాక్ష‌న్ 3డి యానిమేష‌న్ ను చూపిస్తోన్న సినిమా ఇది. ఇందులో పందిపిల్ల‌ను చాలా రియ‌ల్ గా చూపించే ప్ర‌య‌త్నం చేసారు గ్రాఫిక్స్ టీం. దీనికోసం చాలా విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా వాడుకున్నారు ర‌విబాబు. ద‌స‌రా సెల‌వుల్లో ప్రేక్ష‌కుల ఈ సినిమా ముందుకు రాబోతుంది.