బాలీవుడ్ భామ ఆదా శర్మ చిత్ర విచిత్రమైన వీడియోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటూ ఉంటారు.  మల్టీటాలెంటెడ్ గా పేరున్న ఆదాశర్మ సోషల్ మీడియా పోస్ట్స్ ని ఇష్టపడే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. తాజాగా ఆదా శర్మ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆదా చీర మడికట్టులో పిల్లిగంతులు వేశారు. చిన్న పిల్ల వలే శరీరాన్ని విల్లులా వంచుతూ... ఆదా వేసిన ఫీట్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. 

కొందరు ఆదా నీకు అంత ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందని కామెంట్ చేయగా , మరికొందరు ఆదా మీరు చేపలు పట్టే అమ్మాయిలా కనిపిస్తున్నావు అని కామెంట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆదా శర్మ వీడియో వైరల్ అవుతుంది. ఆదా శర్మ గతంలో కూడా కూడా డాన్స్ చేస్తూ, ఫైట్స్ చేస్తూ కొన్ని వీడియోలు పోస్ట్స్ చేశారు. విచిత్ర వేషధారణకు కూడా ఆదా శర్మ చాలా ఫేమస్. 

ఇక 2014లో నితిన్ హీరోగా దర్శకుడు పూరి జగాన్నాద్ తెరకెక్కించిన హార్ట్ అటాక్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఆదా శర్మ. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించారు. అడివి శేషు హీరోగా తెరకెక్కిన క్షణం మూవీలో ఆదా నటించగా, ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. 2019లో రాజశేఖర్ హీరోగా విడుదలైన కల్కి, ఆదాకు తెలుగులో చివరి చిత్రం. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)