ఇటీవల కాలంలో టాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకు అన్ని ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ ప్రకంపనలు సృష్టిస్తోంది. పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఈ లిస్ట్ లో ఉండటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలు ఉలిక్కి పడుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంద మంది కాస్టింగ్‌ కౌచ్‌ అనేది ప్రధాన సమస్య అంటుంటే. మరికొందరు మాత్రం ఇది అంతా ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదంటున్నారు. అంతేకాదు మీటూ ఉద్యమాన్ని తమ స్వార్థం కోసం కొందరు మిస్ యూజ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

తాజాగా ఈ విషయంపై హాట్ బ్యూటీ అదా శర్మ కూడా స్పందించింది. అయితే అదా మాత్రం కాస్టింగ్ కౌచ్‌ అనేది అసలు సమస్యే కాదన్నట్టుగా మాట్లాడింది. కాస్టింగ్ కౌచ్‌ అనేది ఎవరు బలవంతంగా చేయరని, తప్పు చేయాలా వద్దా అనే ఆప్షన్‌ మనకు ఉంటుందని చెప్పింది. అందుకు తనో  ఎగ్జాంపుల్‌ కూడా చెప్పింది.  `అందరూ సోఫాలు కొంటారు. కానీ దాని మీద పడుకోవాలా, కూర్చోవాలా, నిలబడాలా.. అసలు దాని జోలికి వెళ్లకుండా దూరంగా ఉండాలా అన్నది మన నిర్ణయం మీదే ఆదారపడి ఉంటుంది. అంటూ కామెంట్‌ చేసింది.

అంతేకాదు అవకాశం కోసం మనం ఎవరి కోరికనో ఎందుకు తీర్చాలి. అలాంటి పరిస్థితి వస్తే అవకాశం పోయినా సరే ముందే కమిట్‌మెంట్‌లకు గట్టిగా నో చెప్పాలి. మీరు అలా చెప్పకుండా మీ అవకాశాల కోసం లొంగిపోయి తరువాత కాస్టింగ్ కౌచ్‌ అంటూ రాద్ధంతం చేయటం సరికాదు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది అదా శర్మ.