ఆ హీరోయిన్ కూరగాయలు అమ్ముకుంటోంది!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 23, Aug 2018, 11:06 AM IST
Adah Sharma looks unrecognisable in new photos
Highlights

'1920' అనే హారర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అదాశర్మ తెలుగులో 'హార్ట్ ఎటాక్' చిత్రంతో యూత్ ని ఆకట్టుకుంటుంది. ఆ తరువాత 'సన్నాఫ్ సత్యమూర్తి','క్షణం' వంటి సినిమాల్లో నటించింది. 

'1920' అనే హారర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అదాశర్మ తెలుగులో 'హార్ట్ ఎటాక్' చిత్రంతో యూత్ ని ఆకట్టుకుంటుంది. ఆ తరువాత 'సన్నాఫ్ సత్యమూర్తి','క్షణం' వంటి సినిమాల్లో నటించింది. నటిగా మంచి పేరు దక్కించుకున్నప్పటికీ అదాకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

దీంతో తమిళం, హిందీ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. గతేడాది బాలీవుడ్ లో 'కమాండో 2' సినిమాలో నటించినా.. అదాకు వర్కవుట్ కాలేదు. ఈ మధ్య కాలంలో ఫోటో షూట్లు, వీడియోలు అంటూ కాలం గడుపుతోన్న ఈ బ్యూటీ సడెన్ గా రోడ్ మీద కూరగాయలు అమ్ముకుంటూ కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఆమెను గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది.

పూర్తి డీగ్లామరస్ లుక్ తో అదా అవతారం చూసిన వారు షాక్ అవుతున్నారు. అసలు అమ్మడు ఇలా చేయడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీయగా, ఓ హాలీవుడ్ సినిమా కోసం అదా ఈ లుక్ ని టెస్ట్ చేస్తోందని తెలిసింది. ప్రస్తుతం అదా కూరగాయలు అమ్ముతున్న ఫోటోలు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి. 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader