హార్ట్ ఎటాక్ సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరైన బ్యూటీ అదా శర్మ. ఆ సినిమా తరువాత ఈ బ్యూటీ సినిమాలకంటే గ్లామర్ తోనే ఆడియెన్స్ ని ఎక్కువగా ఆకర్షించింది. బేబీ నవ్వుతోనే కాకుండా తన కొంటే చూపుతో కూడా కుర్రాళ్ళ గుండెల్లో హార్ట్ ఎటాక్ తెప్పించగలదు. 

రీసెంట్ గా జరిగిన లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో ఆదా బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సీన్స్ ని తన ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. అందుకు సమందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బేబీ సరికొత్త గ్లామర్ తో మెరిసిన తీరుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే తలపై అదా 5కేజీల బరువుతో ఉన్న ఒక హెడ్గేర్ ని అలకరించుకుంది. అది బరువుగా ఉన్నప్పటికీ నచ్చినట్లు పేర్కొంది. 

అదా తన అందాల పొగరుతో ఎంత మంది హీరోయిన్స్ కైనా పోటీ ఇవ్వగలదని పాజిటివ్ గా కామెంట్ వస్తున్నాయి. ఇక ఆదా సినిమాల విషయానికి వస్తే.. మొన్న కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హాట్ బ్యూటీ నెక్స్ట్ బాలీవుడ్ కమాండో 3 సినిమాతో రానుంది. అలాగే మరో రెండు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది.