రాజశేఖర్ నటించిన థ్రిల్లర్ డ్రామా కల్కి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమాలో నటించిన హీరోయిన్ అదా శర్మా సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే బేబీకి కెరీర్ లో ఇప్పటి వరకు సరైన హిట్ తగల్లేదు. 

సోలో హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గాయి. గ్లామర్ తో అలా అలా కెరీర్ ను నెట్టుకొస్తున్నప్పటికీ అదా సంతృప్తి చెందడం లేదు.  అయితే కల్కిలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో హిట్టయితే కాస్త పేరొస్తుందని స్టార్ హీరోస్ తో అవకాశాలు అందుకోవచ్చని అదా ఆశపడుతోంది. 

అదా శర్మ చేతిలో మరో మూడు సినిమాలుకూడా ఉన్నాయి. బాలీవుడ్ లో కమాండో 3తో పాటు మరో రెండు సినిమాలు చేస్తోంది. ఇక సౌత్ లో అవకాశాలు పెరగాలంటే అమ్మడు ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాల్సిందే. మరి కల్కి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అ! దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించారు.