ప్రముఖ నటి విజయలక్ష్మి, నామ్‌ తమిళర్‌ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ మధ్య వివాదం కొన్ని రోజులుగా మీడియాలో నిలుస్తోంది. తనని వివాహం చేసుకుని మోసం చేశాడని సీమాన్ పై విజయలక్ష్మి మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తోంది.

ప్రముఖ నటి విజయలక్ష్మి, నామ్‌ తమిళర్‌ కట్చి అధ్యక్షుడు సీమాన్‌ మధ్య వివాదం కొన్ని రోజులుగా మీడియాలో నిలుస్తోంది. తనని వివాహం చేసుకుని మోసం చేశాడని సీమాన్ పై విజయలక్ష్మి మీడియా ముఖంగా ఆరోపణలు చేస్తోంది. తాజాగా ఆమె గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీమాన్ పై ఫిర్యాదు చేశారు. 

పోలీస్ కమిషనర్ సందీప్ రాయ్ ని కలసిన విజయలక్ష్మి సీమాం పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించి అతడిని అరెస్ట్ చేయాలని కోరారు. విజయలక్ష్మికి అండగా తమిళర్‌ మున్నేట్ర పడై వ్యవస్థాపక అధ్యక్షురాలు వీరలక్ష్మి కూడా కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. 

2008లో సీమాన్ తో తనకి వివాహం జరిగినట్లు విజయలక్ష్మి ఆరోపిస్తోంది. కానీ అతడు తనని మోసం చేయడం కాక తన మనుషులతో బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడు అంటూ విజయలక్ష్మి తెలిపింది. మీడియాతో మాట్లాడుతూ బోరున ఏడ్చేసింది. గతకొన్నేళ్ళుగా నేను సీమాన్ పై పోరాటం చేస్తున్నాను. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. 

ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వంపై, పోలీస్ వ్యవస్థపై నమ్మకంతో ఉన్నాను. అతడిని అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలి. సీమాన్ కి విజయలక్ష్మికి వివాహం జరిగినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఆమెకి తోడుగా వచ్చిన వీరలక్ష్మి తెలిపారు. 

నేను అతడి విషయాలు బయట పెడుతున్నానని సీమాన్ నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. నేను పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నట్లు చిత్రీకరిస్తున్నాడు. కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాల్సిన విషయాలని పెద్దది చేస్తోంది అతడే. భవిష్యత్తులో ఎన్ని బెదిరింపులు ఎదురైనా వెనక్కి తగ్గను అంటూ విజయలక్ష్మి కన్నీరు పెట్టుకుంటూనే మీడియాతో మాట్లాడారు.