తను ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే అది హీరో ప్రభాస్ కే చెబుతానని అంటోంది నటి వరలక్షమీ శరత్ కుమార్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వరలక్ష్మీకి అలవాటు. మొహమాటాలకు పోకుండా చాలా బోల్డ్ గా బిహేవ్ చేస్తుంటుంది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం కోలివుడ్ లో బిజీ నటిగా మారింది వరలక్ష్మీ శరత్ కుమార్. గతంలో ఈ భామ నటుడు విశాల్ తో ప్రేమ వ్యవహారం నడిపించేదని త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వచ్చాయి కానీ ఇటీవల విశాల్ పెళ్లి ప్రకటనతో ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె నటుడు ప్రభాస్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన ఈ బ్యూటీ ఎవరికైనా ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే అది ప్రభాస్ కే అంటూ సంచలనానికి తెర లేపింది. ప్రస్తుతం ఈమె ఐదారు చిత్రాలతో బిజీగా గడుపుతోంది.