సాధారణంగా పెళ్లైన హీరోయిన్లు సినిమాలకు దూరమవుతుంటారు. ఒకవేళ రీఎంట్రీ ఇచ్చినా.. అక్క, వదిన పాత్రలు చేస్తుంటారు. కానీ నటి స్వాతి మాత్రం బికినీ వేసి మరీ నటిస్తానని షాకింగ్ కామెంట్స్ చేసింది.

గతేడాది వికాస్ అనే పైలెట్ ని పెళ్లి చేసుకున్న స్వాతి ఇండోనేషియాలో కాపురం పెట్టింది. రీసెంట్ గా ఓ టీవీ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె బికినీ వేసి హల్చల్ చేసింది. మళ్లీ సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ.

అయితే ఆమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయంపై మాట్లాడిన స్వాతి.. ''స్విమ్ సూట్ లో నా ఫోటోలు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. కానీ నా భర్తకి ఆశ్చర్యమేమీ కలగలేదు. చిన్నప్పటి నుండి నేను స్విమ్ చేస్తున్నా.. స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్ వేస్తాం కదా..'' అంటూ చెప్పుకొచ్చిన ఆమె ఒకవేళ మేకర్లు అలా నటించమని అడిగుంటే అప్పుడే బికినీ వేసేదాన్ని అంటూ ఇప్పుడు కూడా తనకు బికినీ వేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నట్లుగా మాట్లాడింది. 

పెళ్లైన తరువాత తనకు మరింత స్వతంత్రం వచ్చిందని సినిమాల్లో నటించడమనే విషయంలో తనకు ఎలాంటి పరిమితులు లేవని స్పష్టం చేసింది. మరి మన దర్శకనిర్మాతలు ఎవరైనా స్వాతికి అవకాశాలు ఇస్తారేమో చూడాలి!