గతేడాదిలో కాస్టింగ్ కౌచ్ విషయంలో ప్రకంపనలు సృష్టించిన నటి శ్రీరెడ్డి.. ఇప్పుడు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి సినిమా ఇండస్ట్రీ, రాజకీయాలకు సంబంధించి కొన్ని వీడియోలు చేసి పోస్ట్ చేస్తోంది. రీసెంట్ గా పవన్ గురించి పూనమ్ మాట్లాడిన మాటలు అంటూ ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

ఇప్పుడు ఆ ఆడియోకి సంబంధించి శ్రీరెడ్డి ఓ వీడియో రూపొందించింది. ఇందులో ఆమె పూనమ్ ని సపోర్ట్ చేస్తూ.. పవన్, త్రివిక్రమ్ లను తిట్టిపోసింది. పవన్, త్రివిక్రమ్ లకు అమ్మాయిల పిచ్చని, చాలా మంది జీవితాలతో వాళ్లు ఆడుకున్నారని, అది వాళ్ల గేమ్ ప్లానింగ్ అని సంచలన కామెంట్స్ 
చేసింది.

పవన్ ని గురువుగా భావించిన పూనమ్ అతడి కారణంగానే సూసైడ్ చేసుకుందని శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్వతి మెల్టన్.. త్రివిక్రమ్ ని ప్రేమిస్తే ఆమె లైఫ్ తో కూడా ఆదుకున్నాడని.. ఆ కారణంగా ఆమె ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోయిందని షాకింగ్ కామెంట్స్ చేసింది.

పవన్ కారణంగా చాలా మంది అమ్మయిలు బాధ పడ్డారని, రేణు దేశాయ్ విషయంలో కూడా అదే జరిగిందని.. ఇప్పుడున్న అమ్మాయి పరిస్థితి ఏమవుతుందోనని సందేహం వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యక్తి సీఎం పదవికి ఎలా అర్హుడవుతాడని ప్రశ్నించింది.