తమిళ టీవీ నటి, సూపర్‌ సింగర్‌ షో ఫేమ్‌ సౌందర్య బల నందకుమార్‌ తనకు ఎదురైన వేధింపులను బయటపెట్టింది. ఓ ప్రొఫేసర్‌ తనతో ఎలా అభ్యంతరంగా వ్యవహరించారో వెల్లడించింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన చేదు అనుభవాలను వెల్లడించారు. ఆమె చెబుతూ, `నువ్వంటే ఇష్టం. నా కోరిక తీరిస్తే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నిన్ను చూస్తే చాలు.. ` ప్రొఫేసర్‌ అసభ్యకరంగా చేసిన చాటింగ్‌ని ఆమె స్క్రీన్‌ షాట్‌ని పంచుకుంది. 

`ఒక మహిళతో ఓ ప్రొఫేసర్‌ మాట్లాడే విధానం ఇది. సిగ్గుచేటు. అతని ప్రొఫైల్‌ చూస్తే మధురైకి చెందిన ప్రొఫేసర్‌ అని అర్థమవుతుంది. కాలేజ్‌లో అతని చుట్టూ ఉండే బాలికలు జాగ్రత్తగా, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నా. ఇలాంటి వేధవలను ఏం చేయాలి? ఖచ్చితంగా దీనికి అతని మూల్యం చెల్లించాలి. ఇలాంటి ప్రొఫేసర్‌ ఉన్న కాలేజ్‌లోని అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి` అని హెచ్చరించింది. 

ప్రస్తుతం ఆ వ్యక్తిని ట్రాక్ చేస్తున్నానని, అతని గురించి అన్ని వివరాలు సేకరించి అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె తెలియజేసింది. అంతే కాదు, ఆ ప్రొఫెసర్ పనిచేసే కాలేజ్‌ని గుర్తించి, అక్కడి యాజమాన్యానికి కూడా అతని బుద్ధిని తెలియజేస్తానని, ఇలాంటి వారిని అస్సలు వదిలే ప్రసక్తే లేదని ఖరాఖండీగా చెప్పేసింది. సౌందర్య నిర్ణయంపై, ధైర్యంపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, సీరియల్స్‌లోనే కాకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ `కబాలి`, దళపతి విజయ్ `మాస్టర్` వంటి చిత్రాలలో నటించింది సౌందర్య.