పెళ్లి పేరుతో అనేకమందిని మోసం చేసిన కోలీవుడ్ నటి శృతి ఆట కట్టయింది. అమాయక ” వరుల ” నుంచి అక్రమ వసూళ్ళకు పాల్పడింది. బాధితుల్లో చాలామంది తమ గుట్టు ఎక్కడ బయట పడుతుందోనని కామ్ అయిపోగా.. బాలమురుగన్ అనే ఎన్నారై మాత్రం ” ధైర్యంగా ” పోలీసులకు ఈమెపై ఫిర్యాదు చేశాడు.

పెళ్లి పేరు చెప్పి తననుంచి 43 లక్షలు తీసుకుని..కొన్నాళ్ళ తర్వాత పత్తా లేకుండా పోయిందని అన్నాడు. ” ఆడిపోనాల్ అవని ” అనే తమిళ చిత్రంలో నటించి మంచి నటిగా పాపులర్ అయిన శృతి అసలు రంగు బయటపడేసరికే చాలామంది ఈమె చేతిలో మోసపోయారు. దాంతో ఈ నటిమీద కోయంబత్తూరు పోలీసులు గూండా చట్టాన్ని ప్రయోగించారు. శృతి తో బాటు ఆమె పేరెంట్స్ చిత్ర, ప్రసన్న వెంకటేష్, సోదరునిపైనా కేసులు పెట్టి.. కటకటాల్లోకి నెట్టారు. వీరి అరెస్టు యవ్వారం కోలీవుడ్‌ని కుదిపేసింది.