ప్రస్తుతం సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, కోలివుడ్ లో చిన్మయి ఈ ఉద్యమంపై పోరాడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టారు. 

ప్రస్తుతం సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. బాలీవుడ్ లో తనుశ్రీదత్తా, కోలివుడ్ లో చిన్మయి ఈ ఉద్యమంపై పోరాడుతున్నారు. ఇప్పటికే పలువురు తారలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించిబయటపెట్టారు.

చాలా మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా నటి షకీలా మీటూ ఉద్యమంపై కామెంట్ చేసింది. 'ఏ అమ్మాయికైనా అలాంటి లైంగిక వేధింపులు, బెదిరింపులు ఎదురైతే అప్పుడే, అక్కడే బయటపెట్టాలి. ఇప్పుడు చాలా ఏళ్ల తరువాత ఆ వ్యక్తుల పేర్లు చెప్పడం తెలివైన పని కాదు..

నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. చిత్రపరిశ్రమలోకి కొత్తగా వచ్చే చాలా మంది ఈ ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారికి సరైన రీతిలో బుద్ధి చెప్పా.. ఇప్పుడు నేను వారికి కనిపిస్తే చేతులు కట్టుకుంటారు' అంటూ చెప్పుకొచ్చింది.

ఒకప్పుడు మలయాళ ఇండస్ట్రీలో స్టార్ గా వెలుగొందిన షకీలా తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. కొన్నేళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె జీవిత చరిత్రతో దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇందులో రిచా చద్దా.. షకీలా పాత్ర పోషిస్తోంది.