టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సినిమాలతో పాటు పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటుంది.  తాజాగా ఆమె కుర్ కురే స్నాక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఈ క్రమంలో కుర్ కురే ప్యాకెట్ పట్టుకొని ఫోటోకి ఫోజిచ్చి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

దీంతో నెటిజన్లు ఆమెపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. డబ్బు కోసం ఇలాంటి అనారోగ్యమైన ఆహారాన్ని ప్రోత్సహిస్తావా..? అంటూ ఆమెపై మండిపడ్డారు. ఓ నెటిజన్ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే నువ్వు ఇలా హాని కలిగించే ఫుడ్ తినమని ప్రచారం చేయడం ఏం బాగాలేదు అంటూ ట్వీట్ చేసింది.

అది చూసిన సమంత.. ''నా సండే మీల్స్ ఫోటోని మీకు పంపిస్తా.. అవును.. నేను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటాను. అలాగే చీట్ డేస్ లో ఓ సామాన్యురాలిగా ఇలాంటి స్నాక్స్ తీసుకోవడం ఇష్టం. ఈ బ్రాండ్ స్నాక్స్ తో పాటు మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతుంది'' అంటూ బదులిచ్చింది.

ప్రస్తుతం సమంత నటించిన 'మజిలీ' సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అలానే నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ బేబీ.. ఎంత సక్కగున్నావే' అనే సినిమాలో నటిస్తోంది.