టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన నటి రోజా ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ప్రస్తుతం రాజకీయాలు, టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. అయితే గతంలో ఓ సినిమా షూటింగ్ కి చెప్పిన సమయానికి వెళ్లలేకపోయినందుకు సెట్ లోనే కూర్చొని ఏడ్చిన సంగతిని గుర్తు చేసుకున్నారు రోజా.

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కిస్తున్న 'రథయాత్ర' సినిమాలో హీరోయిన్ గా రోజాని తీసుకున్నారు. అయితే అప్పటికే ఆమె ఓ తమిళ చిత్రం చేస్తున్నారు. అక్కడ టాకీ పూర్తయిన తరువాత రెండు రోజుల పాటు కొడైకెనాల్ లో సాంగ్ షూటింగ్ చేయాల్సి వచ్చింది.

ఆ రెండు రోజుల గ్యాప్ లో రోజా 'రథయాత్ర' షూటింగ్ కి వెళ్లాలి. దానికి తమిళ సినిమా వాళ్లు కూడా ఒప్పుకోవడంతో రోజా 'రథయాత్ర' షూటింగ్ కి డేట్స్ ఇచ్చారత. అయితే తాను వెళ్లిపోతే తిరిగి రాదేమోనని తమిళ సినిమా మేకర్స్ తనను వెళ్లనివ్వకుండా బ్లాక్ చేశారట. అప్పటికే 'రథయాత్ర' నిర్మాత రోజాపై కోపంగా ఉన్నారట. 

మూడు రోజుల తరువాత 'రథయాత్ర' షూటింగ్ స్పాట్ కి వెళితే.. తన కళ్లవెంట నీళ్లు వచ్చేశాయని, తన వల్ల తప్పు జరిగిందని ఏడ్చేసిందట. అది చూసిన నిర్మాత కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు.. తనను ఓదార్చినట్లు గుర్తుచేసుకుంది. అప్పట్లో చాలా సున్నితంగా ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.