42ఏళ్ళ రేష్మా సోమవారం మృతి చెందినట్లు సమాచారం. ఆమెకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. 

చిత్ర పరిశ్రమలో వరుసగా అకాల మరణాలు సంభవిస్తున్నాయి. గత ఏడాది కాలంలో కరోనా కారణంగా చాలా మంది మృత్యువాత పడ్డారు. అలాగే కొందరు ఆరోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. తాజాగా నటి రేష్మా అలియాస్‌ శాంతి అకాల మరణం పొందారు. 42ఏళ్ళ రేష్మా సోమవారం మృతి చెందినట్లు సమాచారం. ఆమెకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమెకు కరోనా పరీక్షలు చేశారు. తొలుత పాజిటివ్‌ అని, ఆ తదుపరి నెగెటివ్‌గా భిన్న ఫలితాలు వచ్చాయి.అయితే ఆమెకు శ్వాస సమస్య తీవ్రం కావడంతో సోమవారం సాయంత్రం మృతి చెందారు. 

బీసెంట్‌నగర్‌ శ్మశానవాటికలో మంగళవారం అంత్యక్రియలు జరిగాయి. కాగా కార్తీక్‌ హీరోగా తెరకెక్కిన 'కిళక్కు ముగం' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన రేష్మా పలు తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించారు. 'ఈ రోజుల్లో', 'లవ్‌ సైకిల్‌' సినిమాలతో తెలుగులోనూ తళుక్కున మెరిసింది. సీనియర్‌ నటుడు రవిచంద్రన్‌ కుమారుడు హర్షవర్ధన్‌ను వివాహం చేసుకుని తన పేరును శాంతిగా మార్చుకున్నారు. రేష్మాకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.