పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. కాంబినేషన్ రీత్యా ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా చర్చ నెలకొంది. కెజిఎఫ్ చిత్రంతో సంచలనాలు నమోదు చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ మొదలైంది. తెలంగాణా రాష్ట్రంలోని గోదావరి ఖని మైనింగ్ ప్రాంతంలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. కాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. 


సలార్ మూవీ కోసం బాహుబలి కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారట. బాహుబలి సిరీస్లో కీలకమైన శివగామి రోల్ చేసిన రమ్యకృష్ణ సలార్ చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సలార్ మూవీలో ప్రభాస్ కి అక్కగా రమ్యకృష్ణ కనిపిస్తారనేది సదరు వార్తల సారాంశం. బాహుబలి మూవీలో ప్రభాస్ కి తల్లిగా నటించిన రమ్యకృష్ణ సలార్ మూవీలో అక్కగా కనిపిస్తారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ జోరుగా ప్రచారం అవుతుంది. 

ఇక సలార్ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్నారు. మొదటి షెడ్యూల్ లో శృతి హాసన్ సైతం పాల్గొన్నారు. 2022 సమ్మర్ కానుకగా సలార్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు. సలార్ తో పాటు రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాల షూటింగ్స్ లో ప్రభాస్ పాల్గొంటున్నారు. ఈ ప్రాజెక్ట్స్ అనంతరం దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న భారీ ప్రాజెక్ట్ ప్రభాస్ చేయాల్సి ఉంది.