అందాల తార రమ్య కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్ గా నటించింది. పలు చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేస్తూనే నటనతో కూడా మెప్పించింది. రమ్య తెలుగులో నటించిన ఏకైక చిత్రం కళ్యాణ్ రామ్ 'అభిమన్యు'.  ఆ చిత్రం నిరాశపరచడంతో రమ్యకు టాలీవుడ్ లో మరో అవకాశం రాలేదు. 

సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంలో రమ్య హీరోయిన్ గా నటించింది. ఆ చిత్రం తెలుగులో డబ్ అయింది. కన్నడ, తమిళ భాషల్లోనే రమ్య ఎక్కువగా నటించింది. ఇదిలా ఉండగా రమ్య రాజకీయాలపై ఆసక్తితో కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2013లో కర్ణాటకలోని మాండ్య ఉపఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందారు. 

ప్రస్తుతం రమ్య కాంగ్రెస్ పార్టీలో నేతగా కొనసాగుతున్నారు. రమ్య రాజకీయాల పట్ల విసిగిపోయినట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆమె వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నారట. తన బాల్య స్నేహితుడు రఫెల్ ని వివాహం చేసుకుని దుబాయ్ లో స్థిరపడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తన పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలపై రమ్య ఇంకా స్పందించలేదు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా రమ్య పలు చిత్రాల్లో నటించారు.