ఫిట్ సెన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) జిమ్ లో హెవీ వర్క్ అవుట్స్ చేస్తూ నెటిజన్లను  షాక్ కు గురిచేస్తోంది. ఈ మేరకు జిమ్ వీడియోను షేర్ చేస్తూ ట్రైగర్ ష్రాఫ్, జాక్వెలిన్ కు వర్క్ అవుట్  ఛాలెంజ్ విసిరింది.

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇక బాలీవుడ్ లోనే హంగామా చేస్తోంది. వరుసగా హిందీ చిత్రాల్లోనే నటిస్తూ తన సత్తా చాటుకుంటోంది. బాలీవుడ్ బడా స్టార్స్ సరసన ఆడిపాడుతూ.. నార్త్ ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకుంటోంది. రకుల్ ప్రీత్ తాజాగా నటించిన చిత్రం ‘ఎటాక్’ Attack. ఈ చిత్రం ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది. అలాగే అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్ తో కలిసి రన్ వే 34 (Runway 34)లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ రెండు చిత్రాల ప్రమోషన్స్ లో బిజీగా ఉంది రకుల్.

ఈ మేరకు హాట్ ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. తాజాగా రకుల్ ప్రీత్ జిమ్ లో హెవీ వర్క్ అవుట్ చేస్తూ నెటిజన్ల మతి పోగొడుతోంది. మరింత స్లిమ్ ఫిట్ బాడీని సొంతం చేసుకునేందుకు తెగ ఆరాటపడుతోందీ ఫిట్ నెస్ సుందరి. ఈ వీడియోలో హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఒంట్లోని ఫ్యాట్ ను కరిగిస్తోంది. అలాగే లారీ టైర్ ను అవలీలంగా రొటేట్ చేస్తూ మగాళ్లను సైతం షాక్ కు గురిచేస్తోంది. అయితే ఈ వర్క్ అవుట్ ను రకుల్ ప్రీత్ ‘ఎటాక్’ మూవీ కోసం చేసినట్టు చెప్పింది.

వీడియోను పంచుకుంటూ బాలీవుడ్ స్టార్స్ కు ఛాలెంజ్ విసిరింది రకుల్ ప్రీత్ సింగ్.. ‘ఇక్కడ ఎటాక్ ఛాలెంజ్ ఉంది. మే నహి టుట్నా సాంగ్ పై టైగర్ ష్రాఫ్ మరియు జాక్వెలిన్ ఫెర్నాడేజ్ కు నా సవాల్ ను స్వీకరించి, వర్క్ అవుట్ వీడియోలను చేయాలి. అలాగే ఈ ఛాలెంజ్ ను కొనసాగించాలని కోరుతున్నా. వీటిలో బెస్ట్ వీడియోను నేనే షేర్ చేస్తాను’ అంటూ పేర్కొంది. ఇక రకుల్ ఛాలెంజ్ ను వీరిద్దరూ స్వీకరిస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే, రకుల్, జాన్ అబ్రహం (John Abraham)తో కలిసి నటించిన 'ఎటాక్' మూవీపై నోయిడాలో జరిగిన ఈ సినిమా ప్రమోషన్‌లో స్పందించింది. ఈ చిత్రం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి రూపొందించిందని తెలిపింది. సైబర్‌ట్రానిక్ హ్యూమనాయిడ్ సూపర్-సోల్జర్ గురించి సినిమాలో వివరంగా ఉందని చెప్పుకొచ్చింది. 'ఎటాక్' చిత్రానికి లక్ష్య రాజ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు రకుల్‌ కలిసి చిత్రంలో నటించారు. ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

View post on Instagram