Asianet News TeluguAsianet News Telugu

ఆ హీరోని కొట్టేశా.. నటి పూర్ణ కామెంట్స్!

తెలుగుతో పాటు తమిళం, మలయాళీ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది నటి పూర్ణ. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. 

actress poorna comments on hero vimal
Author
Hyderabad, First Published Nov 30, 2018, 1:58 PM IST

తెలుగుతో పాటు తమిళం, మలయాళీ భాషల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది నటి పూర్ణ. ప్రస్తుతం ఈ బ్యూటీ నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. కేవలం హీరోయిన్ గానే నటించాలనే ఆంక్షలు పెట్టుకోకుండా మంచి పాత్ర దొరికితే నటించడానికి సిద్ధం కావడంతో ఆమెకి అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఆమె విమల్ హీరోగా నటిస్తోన్న 'ఇవనుక్కు ఎంగేయో మచ్చమ్ ఇరుక్కు' అనే సినిమాలో నటిస్తోంది ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతుంది. ఈ సినిమా గురించి పూర్ణ మాట్లాడుతూ.. ''ఇందులో రౌడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా. హీరో విమల్ ను, సింగంపులిని తరిమి కొట్టడమే నా పని. అలాంటి సన్నివేశాల్లో చాలా సార్లు వారిని నిజంగానే కొట్టేశాను'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఈ సినిమాలో బాయ్ కట్ తో కనిపించడం కోసం పూర్ణ ఏకంగా గుండు కొట్టించుకుంది. అలా చేయడం వలనే బాయ్ కట్ సాధ్యమైందని వెల్లడించింది. ఈ సినిమాతో పాటు బ్లూవేల్ అనే మరో సినిమాలో నటిస్తోంది. అలానే తెలుగులో ఓ సినిమా, మలయాళంలో మమ్ముట్టితో మరో సినిమాలో నటిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios