మెగాహీరోల కాళ్లు పట్టుకోవాలని ఉంది అంటుంది సీనియర్ నటి పాకీజా అలియాస్ వాసుకి. కష్టాల్లో ఉన్న తనకు జీవితంలో మర్చిపోలేని సాయం చేశారంటూ ఎమోషనల్ అయ్యింది సినియర్ నటి.  

మెగా హీరోల కాళ్లు పట్టుకోవాలని ఉంది అన్నారు సీనియర్ నటి పాకీజా. కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తనకు మెగా హీరోలు చేసిన సాయం మరువలేనిదన్నారు. నాగబాబు ఆతరువాత మెగాస్టార్ చిరంజీవి తనకు చెరో లక్ష రూపాయలు సాయం చేశారన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కష్టాలు తెలుసుకున్న తెలుగు ఇండస్ట్రీ వారు.. తన ఫ్యాన్స్ కొంత మంది.. 1000 రూపాయల నుంచి 10 వేల వరకూ సాయం అందిస్తున్నారని. తన అకౌంట్ నంబర్ అనౌన్స్ చేయడంతో.. వరుసగా సాయం చేస్తూనే ఉన్నారని ప్రకటిచింది పాకీజా. ఇందుకోసం అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన్నారు. 

అంతే కాదు మోహన్ బాబు కూడా తనకు సాయం చేశారని వెల్లడించారు పాకీజా. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 150 సినిమాలకు పైగా నటించిన స్టార్ లేడీ కమెడియన్ పాకీజా... అలియాస్ వాసుకి. అన్ని సినిమాలు చేసినా కాని.. కష్టాలవల్ల డబ్బంతా ఆవిరైపోయి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది నటి పాకీజా. కడుపునిండా తిండి కూడా లేకుండా ఇబ్బంది పడుతుంది. దీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ ఆమెను ఇంటర్వ్యూ చేయగా.. తన పరిస్థితి గురించి చెప్పి బాధపడింది పాకీజా. 

తమిళ సినిమా సంఘాల నుంచి తనకు ఎటువంటి సాయం రాలేదన్నారు. అంతో ఇంతో.. తనకు తెలుగువారి నుంచే సహాయం అందిందన్నారు. తెలుగులో అవకాశాలు వస్తే.. ఇక్కడికే వచ్చి బ్రతుకుతానన్నారు పాకీజా. అక్కడ ఒక పూట తినడానికి కూడా కష్టంగా ఉందన్నారు పాకీజా.ఇక ఈ ఇంటర్వ్యూ చూసిన మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించారు. పాకీజా ఇంటర్వ్యూ చూసిన ఆయన చలించిపోయారు. వెంటనే ఆవిడకు లక్ష రూపాయల ఆర్థికసాయం కూడా ప్రకటించారు. అంతే కాదు సాధ్యమైనంత వరకూ ఆమెకు అవకాశాలు వచ్చేలా చేసి.. తన కాళ్ల మీద తాను నిలబడేలా చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. 

ఆతరువాత విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి కూడా పాకీజా కష్టాలకు చలించిపోయి లక్షరూపాయలు పంపించారు. అటు ఫ్యానస్ కూడా తలా చేయి వేసి సాయంచేయడంతో కొంత మేర కష్టా లనుంచి గట్టెక్కింది వాసుకి. తెలుగు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది.ఈక్రమంలో తమిళ ఆర్టిస్ట్ సంఘాలు కాని.. నడిగర్ సంఘం కాని తన విజ్ఞప్తిని పట్టించుకోలేదు అంటోంది పాకీజా. ఆకరికి సూపర్ స్టార్ రజనీ కాంత్, సీఎం తనయుడు నటుడు ఉదయనిధి స్టాలిన్ కు కూడా తన గోడు విన్నవించుకున్నానంటోంది పాకీజా. అయినా ఉపయోగం లేకుండా పోయిందంటోంది. తెలుగు ప్రజలు.. తెలుగు నటులే తనను ఆధరించారంటోంది వాసుకి.