నటి ఆత్మహత్య, కుళ్లిపోయిన స్దితిలో శవం
దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు చెప్పడంతో.. వారు ఫ్లాట్ తలుపును తెరవగా.. నూర్ మాలాబికా దాస్ మరణించారన్న వార్త బయటకు వచ్చింది
అవకాశాలు లేకపోవటం, కెరీర్ లో ఎదగకపోవటం వంటి కారణాలతో ఇబ్బందిపడే సెలబ్రెటీలు ఇండస్ట్రీలో చాలా మంది కనపడతారు. అయితే వారిలో చాలా మంది ఆ డిప్రెషన్ నుంచి బయిటకు వచ్చి తిరిగి జీవితంలో పడతారు. కానీ కొందరు తట్టుకోలేని డిప్రెషన్ లో ఆత్మహత్యకు పాల్పడతారు. అలా బాలీవుడ్ నటి నూర్ మలాబికా ఆత్మహత్య చేసుకుంది. తన ప్లాట్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జూన్ 6న నూర్ మలాబికా దాస్ మృతదేహాన్ని ఆమె లోఖండ్‌వాలా నివాసం నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె శవం కుళ్లిపోయిన స్థితిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2023లో విడుదలైన లీగల్ డ్రామా 'ది ట్రైల్' వెబ్ సిరీస్‌లో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్‌తో కలిసి నటించారు నూర్ మాలాబికా దాస్. ఆమె వయస్సు 37ఏళ్లు. నూర్ మలాబికా.. ఎయిర్ హోస్టెస్ తో తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. కానీ అవకాశాలు కోసం ఉల్లు వెబ్ సిరీస్ లు చేసింది. వాటి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సిసాకియాన్, వాక్‌మ్యాన్, స్పైసీ చట్నీ, ప్యూబిక్ రెమెడీ, ఉద్వేగం, దేఖి ఉండేఖి, బ్యాక్‌రోడ్ హస్టిల్ లాంటి సిరీస్ లలో నటించిన ఆమె.. బాలీవుడ్ లో పలు సినిమాల్లో కూడా కనిపించింది.
గతేడాది రిలీజ్ అయిన ది ట్రయిల్ అనే వెబ్ సిరీస్ లో ఆమె నటించింది.కాజోల్ హీరోయిన్ గా నటించిన ఈ సిరీస్ లో నూర్ ఒక కీలక పాత్రలో కనిపించింది. ఈ సిరీస్ తరువాత ఆమెకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కెరీర్ టర్న్ అయ్యిందనుకున్న సిట్యువేషన్ లో ఇలా సూసైడ్ చేసుకుంది. అందుకు కారణం తను అనుకున్నట్లు కెరీర్ నడవక డిప్రెషన్ లోకి వెళ్లటమే అని బాలీవుడ్ మీడియా అంటోంది.
ఇక వారం క్రితమే ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో నవ్వుతూ కనిపించిన వీడియో ఒకటి పోస్ట్ చేసింది. తరువాత ఏమైందో తెలియదు కానీ, నూర్.. లోఖండ్‌వాలా లోని తన నివాసంలో సూసైడ్ చేసుకుంది. ఆమె ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె మృతదేహం బయటపడింది.
ఇక నూర్ ఇంట్లోవారు ఎవరు స్పందించకపోవడంతో ఆమె మృతదేహాన్ని ఎన్జీవో సహాయంతో పోలీసులు అంత్యక్రియలు నిర్వహించారు. అసలు ఆమెది హత్య.. ఆత్మహత్య అన్న విషయం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.