తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన 'కొమరం పులి' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నికిషా పటేల్ కి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో కోలివుడ్ కి వెళ్లి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో 'తలైవన్‌', 'కరైయోరం', 'నారదన్‌', 'భాస్కర్‌ ఒరు రాస్కెల్' వంటి చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ జీవీ ప్రకాష్ సరసన ఓ కొత్త చిత్రలో నటిస్తోంది. దర్శకుడు ఎలిల్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ క్రమంలో నికిషా పటేల్ కి రహస్యంగా ఆపరేషన్ జరిగిందని, ఎవరికీ తెలియనివ్వకుండా ముంబైలో సైలెంట్ గా ఆపరేషన్ కానిచ్చేశారని వార్తలు వినిపించాయి.

అయితే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం బయటకి రాలేదు. తాజాగా నికిషా పటేల్ ఈ విషయానికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు ఆపరేషన్ జరిగిన మాట నిజమేనని వెల్లడించింది. తనకు చిన్న సర్జరీ జరిగిందని.. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపింది.

ఈ పోస్ట్ చూసిన అభిమానులు తొందరగా కోలుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఎలిల్ సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తయిందని.. కొత్త ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు  తెలిపింది.