హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్‌లో లేట్ నైట్ పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పబ్‌లో పట్టుబడిన వారిలో ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, సినీ నటి నిహారిక కూడా ఉన్నారు. 

హైదరాబాద్ నగరంలోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని పుడింగ్ మింక్ పబ్‌లో లేట్ నైట్ పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుడింగ్ మింక్ పబ్‌ లేట్ నైట్ పార్టీకి సంబంధించి సమాచారం రావడంతో.. ఈ రోజు తెల్లవారుజామున పబ్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ డెకాయ్ ఆపరేషన్‌లో నార్త్, సెంట్రల్, వెస్ట్ జోన్ పోలీసులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో ఉన్న దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు. 

పబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకన్నవారిని పలువురు సెలబ్రిటీలు, బడా బాబుల పిల్లలు ఉన్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఉన్నట్టుగా ఇప్పటికే బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా పబ్‌లో పట్టుబడిన వారిలో ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, సినీ నటి నిహారిక కూడా ఉన్నట్టుగా తెలిసింది. అంతేకాకుండా ఓ మాజీ డీజీపీ కూతురుతో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పబ్‌ నుంచి అదుపులోకి తీసుకున్న కొందరు యువకులు హంగామా సృష్టించారు. తమను ఎందుకు తీసుకువచ్చారంటూ ఆందోళనకు దిగారు. అయితే విచారణ అనంతరం కొందరిని విడిచిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక, అదుపులోకి తీసుకున్నవారి వివరాలు నమోదు చేసుకుంటున్న పోలీసులు.. అనంతరం వారిని పంపించివేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే నిహారికు నోటీసులు ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసులు.. ఆమెను పంపించివేసినట్టుగా తెలుస్తోంది. 

ఇక, పక్కా సమాచారంతో పోలీసులు పార్టీని భగ్నం చేశారు. తెల్లవారుజామున పబ్‌పై దాడి చేశారు. పోలీసులు ఎంట్రీతో కొందరు.. తమ చేతుల్లోని డ్రగ్స్‌ను పడేశారు. కిటికీలో నుంచి బయటపడేసిన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ పబ్ లైసెన్స్ మాజీ ఎంపీ కూతురి పేరున ఉంది. అయితే ఆమె ఈ ఫబ్ ను ఈ ఏడాది జనవరి మాసంలోనే వేరొకరికి లీజుకు ఇచ్చినట్టుగా సమాచారం. ప్రముఖులను మాత్రమే ఈ పబ్ కి అనుమతిస్తారు. అయితే ఇవాళ పోలీసులు దాడులు నిర్వహించిన సమయంలో ప్రముఖులే ఎక్కువగా ఈ పబ్ లో పోలీసులకు చిక్కారు. పబ్ కి వచ్చిన వారిలో ఎవరెవరు డ్రగ్స్ తీసుకొన్నారు, అసలు డ్రగ్స్ ఎలా వచ్చాయనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ పబ్‌పై గతంలో ఫిర్యాదులు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా పుడింగ్ మింక్ పబ్ లేట్ నైట్ పార్టీ వెలుగుచూసిన నేపథ్యంలో పోలీసు శాఖ సీరియస్ అయింది. బంజారాహిల్స్ సీఐ Shiva Chandra ను పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ Sudharshanన్ కు పోలీసులు చార్జ్ మెమో ఇచ్చారు. ఈ పబ్ విషయమై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందున పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.