బాలీవుడ్ లో పలు టీవీ సీరియల్స్ లో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటి నళినీ నేగిపై తన రూమ్మేట్ దాడి చేసింది. ఈ క్రమంలో నళినీ ముఖానికి బాగా దెబ్బలు తగిలాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే.. గతంలో నళినీ, ప్రీతీ అనే అమ్మాయితో కలిసి రూమ్ షేర్ చేసుకున్నారు. ఆ తరువాత నళినీ సొంతంగా ఫ్లాట్ కొనుక్కోవడంతో ఆమె అక్కడకి షిఫ్ట్ అయ్యారు. ప్రీతీ కూడా మరో చోటికి మారాలని భావించినా.. ఫ్లాట్ దొరక్కపోవడంతో నళినీని సహాయం చేయమని కోరింది.

దీంతో నళినీ తన అపార్ట్మెంట్ లో ఉండమని చెప్పింది. కొద్దిరోజులు పాటు మాత్రం ఉండేందుకు నళినీ ఒప్పుకుంది. కానీ ఆ తరువాత ప్రీతీ తల్లి స్నేహలత కూడా ఫ్లాట్ కు రావడంతో సమస్యలు మొదలయ్యాయి. ఫ్లాట్ నుండి వెళ్లిపోవాలని చెప్పినా.. ప్రీతీ, స్నేహలతలు పట్టించుకోకుండా తన వ్యక్తిగత విషయాల్లో కలుగజేసుకోవడంతో తరచూ గొడవలు జరుగుతుండేవి.

ఈ మధ్య గొడవ ముదరడంతో ప్రీతీ, స్నేహలతలు నళినీ మీద భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో గాయపడ్డ నళినీ ఒశివారా పోలీస్ స్టేషన్ లో తల్లీకూతుళ్లపై కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.