సెలబ్రిటీలంతా స్టార్ హోటళ్లలోనే బస చేస్తుంటారు. అయితే అప్పుడప్పుడు వీరికి ఆ హోటల్స్ వలన ఎదురయ్యే సంఘటనలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. లక్షలు ఖర్చు పెట్టి హోటల్స్ లో స్టే చేస్తుంటే కనీసపు శుభ్రత పాటించకుండా సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తాజాగా ప్రముఖ నటి మీరాచోప్రాకి కూడా ఇలాంటి సంఘటనే ఎదురైంది. 

ఇటు సౌత్ లో అటు నార్త్ లో సినిమాలు చేసిన ఈ బ్యూటీ సరైన హిట్టు మాత్రం అందుకోలేకపోయింది. తాజాగా ఈ బ్యూటీ  గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ఉంది. వారం రోజులుగా అదే హోటలో ఉంటున్న ఆమెకి ఆరోగ్యం చెడింది. ఎందుకిలా జరుగుతుందో అర్ధం కాక మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో తనకు ఇచ్చే ఆహారాన్ని చూసి మరీ తింటోంది. అలా తింటున్న సమయంలో ఆమెకి తన ప్లేట్ లో తెల్ల పురుగులు కనిపించాయి.

దీంతో ఆమె నోటి వెంట మాట రాలేదు. తన చేతిలోని ఫోన్ తో ఆ ఫుడ్ ను వీడియోగా తీసి ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. భారీగా ఛార్జ్ చేసే ఫైవ్ స్టార్ హోటళ్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయన్న దానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు.బ్రేక్ పాస్ట్ కోసం తాను చేసి ఆర్డర్ పురుగులతో వచ్చినట్లు చెప్పారు.

తనకీ చేదు అనుభవాన్ని మిగిల్చిన హోటల్ పేరును చెబుతూ.. తాను ఉన్నది డబుల్ ట్రీ హెల్టన్ హోటల్ అని చెప్పారు. ఎంతో డబ్బు చెల్లించి ఇలాంటి హోటల్స్ లో ఉంటుంటే వారు మాత్రం కనీసం సరైన ఆహారం వడ్డించకుండా  నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని అసహం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.